హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డేంజర్‌లో తెలంగాణ జిల్లాలు: కరోనావైరస్ కాటుకు బలయ్యే అవకాశాలు ఎక్కువ: స్టడీ

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే భారత్‌లో 10 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ పోతోంది. దీంతో కొన్ని రాష్ట్రాలు తిరిగి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ఏపీలో అక్కడి ప్రభుత్వం కరోనావైరస్ టెస్టుల సంఖ్యను పెంచింది. అదే సమయంలో కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ కేసులు మాత్రం తగ్గడం లేదు. అంతేకాదు ఓ సంస్థ చేపట్టిన స్టడీ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ తెలంగాణపై వచ్చిన ఆ నివేదిక ఏంటి..?

 కేరళ తీర ప్రాంతాల్లో కరోనా సమూహ వ్యాప్తి: మళ్లీ కఠిన లాక్‌డౌన్ కేరళ తీర ప్రాంతాల్లో కరోనా సమూహ వ్యాప్తి: మళ్లీ కఠిన లాక్‌డౌన్

 మూడో స్థానంలో తెలంగాణ

మూడో స్థానంలో తెలంగాణ

లాన్సెట్‌లో పబ్లిష్ అయిన ఓ స్టడీ దిమ్మతిరిగే నిజాలను బయటపెట్టింది. కరోనావైరస్ బారిన పడే రాష్ట్రాల్లో ఎక్కువగా మధ్యప్రదేశ్‌కు అవకాశం ఉండగా ఆ తర్వాత బీహార్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ స్టడీని చేసేందుకు పలు అంశాలను పరిగణలోకి తీసుకుని సర్వే చేయడం జరిగింది. ఇందులో గృహ నిర్మాణం, పరిశుభ్రత, ఆరోగ్య వ్య వస్థలు లాంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంది. అయితే కోవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేందుకు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఇవి కావని చెబుతున్నారు న్యూఢిల్లీలోని పాపులేషన్ కౌన్సిల్ సైంటిస్టు రాజీబ్ ఆచార్య. వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలను జడ్జ్‌ చేయాలంటే తీసుకోవాల్సిన అంశాలు ఇన్ఫెక్షన్ తీవ్రత, వ్యాధి ఏమేరకు వ్యాప్తి చెందుతోంది, అనారోగ్యంతో నమోదయ్యే మరణాలు, సామాజికంగా మరియు ఆర్థికంగా ఈ మహమ్మారి ఏమేరకు ప్రభావం చూపుతోందో అనే అంశాలను పరిగ ణలోకి తీసుకోవాలని చెబుతున్నారు.

 జిల్లాలకు వేగంగా వ్యాపించనున్న కరోనా

జిల్లాలకు వేగంగా వ్యాపించనున్న కరోనా

ఇక దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, బీహార్ , తెలంగాణ, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్‌బెంగాల్, ఒడిషా,మరియు గుజరాత్ రాష్ట్రాలు మహమ్మారి బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్టడీ వివరించింది. సున్నా నుంచి 1 మధ్య స్కేలింగ్ ఇస్తూ ఈ రాష్ట్రాలకు మహమ్మారి నుంచి ఏమేరకు ప్రమాదం ఉందో వెల్లడించింది. మహమ్మారి నుంచి బయటపడేందుకు ముందస్తు జాగ్రత్తలు, ఇతరత్ర వనరుల ఏర్పాటుకు తమ స్టడీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గం చూపిస్తుందని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో చాలా జిల్లాల్లో కోవిడ్-19 ప్రభావం తీవ్ర స్థాయిలో లేదని కాని భవిష్యత్తులో మాత్రం ఇవి కూడా ఈ మహమ్మారి బారిన పడతాయని హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌కు సున్నా నుంచి 1 స్కేలింగ్‌పై 1 రాగా సిక్కింకు 0 స్కేలింగ్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.

Recommended Video

Kharif Cultivation కి కరోనా దెబ్బ, రైతన్నలకు అదనపు భారం- కూలీల రేట్లు పెరగడంతో Farmers ఆవేదన...!!
 హైదరాబాదు కంటే గ్రామీణప్రాంతాల్లోనే...

హైదరాబాదు కంటే గ్రామీణప్రాంతాల్లోనే...

దేశంలో కొత్త రాష్ట్రం తెలంగాణ మాత్రం కోవిడ్-19 బారిన పడే రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. జూలై 1 నుంచి తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాన్సెట్ నివేదిక రావడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలో కోవిడ్-19 రిస్క్ ఎక్కువగా ఉంటుందని లాన్సెట్ స్టడీ హెచ్చరించింది. అంతేకాదు బుధవారం రోజున కేసుల విషయానని పరిశీలిస్తే హైదరాబాదు నగరం కంటే గ్రామీణ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. హైదరాబాదులో కేసులు కాస్త తగ్గినప్పటికీ జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే తిరిగి పెరిగే అవకాశాలున్నట్లు స్టడీ వెల్లడిస్తోంది. అంతేకాదు హైదరాబాదు నగరంను ఇప్పటికే చాలామంది వీడి తమ సొంతగ్రామాలకు పోవడంతో అక్కడ కరోనావైరస్ కేసులు తగ్గి ఉండొచ్చనే అభిప్రాయం కూడా కొంతమంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
A recent study said that Telangana is more vulnerable to covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X