ఇక ప్రచార పర్వం.. కీలకంగా మారిన మున్సిపాలిటీలు

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల వద్ద తమ నామినేషన్లు దాఖలు చేయగా, సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లో ఉన్న అభ్యర్థుల పత్రాలను అధికారులు స్వీకరించారు. ఈ దశ ముగియడంతో ఎన్నికల ప్రక్రియ కీలక మలుపు తిరిగింది. గురువారం ఒక్కరోజే మొత్తం 7,403 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ప్రజల తీర్పుకు వెళ్లనున్నాయి.

నామినేషన్ల పరిశీలన శుక్రవారం జరగనుంది. ఈ సందర్భంగా నామినేషన్ తిరస్కరణకు గురైన అభ్యర్థులకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మార్గదర్శకాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1న అప్పీళ్లు స్వీకరించగా, వాటిపై ఫిబ్రవరి 2న అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అభ్యర్థుల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 చివరి తేదీగా నిర్ణయించారు. అదే రోజు రిటర్నింగ్ అధికారులు తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పూర్తి స్పష్టత రానుంది.

Telangana Municipal Election Nominations End Over 7 400 Filed as Polling Scheduled on February 11

పోలింగ్ ఫిబ్రవరి 11న..

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11న జరగనుండగా, ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13న నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని మున్సిపల్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పట్టణ పాలన దిశను నిర్దేశించే కీలక ఎన్నికలుగా వీటిని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న పురపాలికల్లో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో 26,80,014 మంది మహిళా ఓటర్లు., 25,62,369 మంది పురుషులు. 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు సంఖ్యలో ముందుండటం ఈసారి ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.

కీలకంగా మారిన మున్సిపాలిటీలు..

మున్సిపాలిటీలలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉండగా, అమరచింత మున్సిపాలిటీలో కేవలం 9,147 మంది ఓటర్లు మాత్రమే ఉండటం విశేషంగా మారింది. ఇది పట్టణాల పరిమాణం, జనసాంద్రతలో ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+