telangana: మున్సిపల్ సమరం.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్..
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధం అయింది. ఫిబ్రవరి 11 బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 2,982 వార్డుల్లో 12,930 మంది భవితవ్యం తేలనుంది.
రాష్ట్రంలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికల పోలింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 11 బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,982 వార్డుల్లో 12,930 మంది భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 12,944 మంది మిగిలారు. అందులో రాష్ట్రవ్యాప్తంగా 9 మున్సిపాల్టీలు రెండు కార్పొరేషన్లలో 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవం కాగా.. 12 మంది కాంగ్రెస్.. ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

ఇక మున్సిపల్ ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు 16,031 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూమ్ లు అలాగే 136 ఓట్ల లెక్కింపు కేంద్రాల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. పటిష్టమైన భద్రత మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications