కొత్త పెన్షన్ల జమ ఆ రోజే, ముహూర్తం ఫిక్స్ - చేతికి మంజూరు పత్రాలు..!!
కొత్త పెన్షన్ లబ్ది దారులకు బిగ్ అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల అర్హుల జాబితా ఖరారు చేసింది. వీరికి కొత్తగా పెన్షన్లు పంపిణీకి డిసైడ్ అయింది. వీరి జాబితాను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మందికి కొత్తగా చేయూత పథకం కింద ఈ పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. వీరికి ముందుగా మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. అర్హుల ఖాతాల్లో నిధుల జమ ముహూర్తం సైతం ఖరారు చేసారు.
చేయూత పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త చేయూత పింఛన్ల లబ్ధి దారులకు ఈనెల 12 నుంచి 18 వరకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టను న్నారు. మున్సిపాలిటీ లు, మండల కేంద్రాల్లో సైతం మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం 19వ తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ మొత్తాన్ని జమ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. కొత్తగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అర్హులైన దరఖాస్తుదారుల పెండింగ్ వెరిఫికేషన్, ఆమోద ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సూచిస్తూ సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జి మంత్రులను ప్రొటోకాల్ ప్రకారం ఈ ప్రత్యేక కార్యక్రమాలకు ఆహ్వానించాలని అధికారులకు సూచించారు.

లబ్దిదారుల ఖాతాల్లో జమ ముహూర్తం
కాగా.. చేయూత పింఛన్లకోసం దరఖాస్తు చేసుకున్న వారికి అభ్యంతరాలు, సమస్యలుంటే పరిష్క రించేందుకు ప్రతి కార్యక్రమ వేదిక వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మొత్తం 5.50 లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులను గుర్తించారు. దాదాపు 4.50 లక్షల మంది చేయూత పథకం ద్వారా వివిధ కేటగిరీల కింద సామాజిక పింఛన్లు పొందేందుకు అర్హత సాధించినట్లు గుర్తించింది. వితంతువుల కేటగిరీ కింద 3 లక్షల మంది, దివ్యాంగులు లక్ష మంది, నేత గీత కార్మికులు 50 వేల మంది ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. లబ్ది దారులు తమ పేర్లు చెక్ చేసుకునేందుకు తెలంగాణ చేయూత పథకం వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది.












Click it and Unblock the Notifications
