కరెంట్ షాక్ అంటే ఇదే... ఒక నెల క‌రెంట్ బిల్లు అక్ష‌రాల ఆరున్నర లక్షలు..!

సాధార‌ణంగా ఓ ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? రెండు బ‌ల్బులు, ఫ్యాన్‌లకు చూసుకుంటే ఐదు వందల వరకు వస్తుంది. మరీ వినియోగం ఎక్కువైతే ఓ 5 వేల వ‌ర‌కు వ‌స్తుంది. ఏసీలు, కూల‌ర్లు, ఎల‌క్ట్రిటిక్ ప‌రిక‌రాలు ఎక్కువ‌యితే ఎంత లేద‌న్నా నెల‌కు ఒక 10 వేల వ‌ర‌కూ వ‌స్తుంది. కానీ, ఈ ఇంటికి ఎంత క‌రెంటు బిల్ వ‌చ్చిందో తెలిస్తే నిజంగానే మీకు క‌రెంట్ షాక్ త‌గులుతుంది. క‌రెంట్ బిల్లు చూసిన ఆ య‌జ‌మానికి ఒక్క‌సారిగా క‌రెంట్ షాక్ కొట్టినంత ప‌న‌య్యింది. ఆ ఇంటికి ఒక్క‌నెల క‌రెంటు బిల్లు అక్ష‌రాల ఆరున్న‌ర ల‌క్ష‌లు వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ సంఘ‌ట‌న జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన డీ పరశురాములు సర్వీస్‌ నంబర్‌ 4620700570 విద్యుత్తు బిల్లు రీడింగ్‌ తీసేందుకు సోమవారం నాడు ట్రాన్స్‌కో సిబ్బంది ఇంటికి వచ్చారు. అయితే, ప్ర‌తి నెలా మాదిరిగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు సబ్సిడీ వర్తించే సర్వీస్‌ నంబర్‌, సోమవారం మీటర్‌ రీడింగ్‌ను స్కాన్‌ చేస్తుండగా ఒక్కసారిగా రూ.6,72,642 బిల్లు క‌నిపించింది. దాంతో ఆ ఇంటి య‌జ‌మాని బిల్లు చూసి ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాడు.

Telangana One month s current bill is six and a half lakhs

200 యూనిట్ల లోపే వచ్చే రీడింగ్‌ ఒక్కసారిగా 5,40,927 యూనిట్లు వాడినట్టు చూపించ‌డంతో ఇంటి యాజమాని ఒక్క‌సారిగా నిర్ఘాంత‌పోయాడు. వెంట‌నే ఆ షాక్ నుంచి తేరుకుని, గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్‌కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయంపై ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డికి స‌మాచారం అందించి వివ‌ర‌ణ కోరారు. దాంతో రీడింగ్‌ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్‌ వచ్చినట్టయితే రీడింగ్‌ జంప్‌ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని ఆయ‌న తెలిపారు. అక్ష‌రాల ఆరున్న‌ర లక్ష‌ల అధిక బిల్లు వచ్చిన మీటర్‌ను టెస్టింగ్‌ కోసం పంపినట్టు అధికారులు వెల్ల‌డించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+