Mahesh Kumar Goud: ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లారు. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. శుక్ర, శని వారాల్లో ఆయన ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని పార్టీ పరిస్థితిపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అలాగే మంత్రి వర్గ విస్తరణపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. శనివారం వీహెచ్ పుస్తక ఆవిష్కరణలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో మాజీ మంత్రి, సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

దీనిపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయినప్పటికీ సంజయ్ ను పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు రంగంలోకి ఆయన్ను బుజ్జగించారు. అప్పటి నుంచి జీవన్ రెడ్డి సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన ప్రధాన అనుచరుడు గంగా రెడ్డి హత్య గురి కావడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana PCC president Mahesh Kumar Goud went to Delhi

ఈ హత్యకు నిరసనగా జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు పార్టీలో చేరిన ఎమ్మెల్యే మాటలే వింటున్నారని వాపోయారు. ఈ క్రమంలోనే మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డిని కలిశారు. నిందితులను వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. గంగా రెడ్డి హత్య చేసింది ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడే అని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే జీవన్ రెడ్డి బహిరంగంగానే మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీవన్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు.

పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జగిత్యాల జరిగిన పలు పరిణామాలను జీవన్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడి వివరించారు. ఇదే విషయాన్ని మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలోపేతం చేసే దీశగా మహేశ్ కుమార్ గౌడ్ పని చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో తలెత్తిన పలు సమస్యలను పరిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+