తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్..!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 6న పిటిషన్ పై విచారణ చేయనుంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 6 న ఏం జరుగబోతోంది అన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలో ఈ ఎన్నికలను మొత్తం 5 దశల్లో నిర్వహించనున్నారు అధికారులు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 6న విచారణ చేపట్టనుంది.

మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీంతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో చెల్లదని చర్చ జరుగుతోంది. దీంతో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అన్న ఆందోళన ఆశావహుల్లో వ్యక్తం అవుతోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications