22ఏ నిషేధిత జాబితాలో మీ ఇల్లు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి...!!
తెలంగాణలో ఇప్పుడు 22ఏ నిషేధిత జాబితా సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తోంది. ఆకస్మికంగా మొదలైన ఈ వివాదం.. చర్చ వెనుక కారణాల పైన ప్రభుత్వం అప్రమత్తం అయింది. మంత్రి పొంగులేటి ఆందోళన అవసరం లేదని అభయం ఇచ్చారు. క్షమాపణలు చెప్పారు. అయితే, కొందరు ముఖ్యుల ప్రయివేటు స్థలాలు సైతం ఈ జాబితాలోకి వచ్చాయనే సమాచారంతో.. సామాన్యులు అలర్ట్ అవుతున్నారు. తమ భూములు చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు మార్గాలను సూచిస్తున్నారు.
తెలంగాణలో ఇప్పుడు 22ఏ భూముల వివాదం తారా స్థాయికి చేరింది. సామాన్యుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. ఈ వివాదంతో ఇప్పుడు కొత్తగా ఇల్లు, ప్లాట్ లేదా వ్యవసాయ భూమి కొనుగోలు చేయాలనుకునే వారికి 22A ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూము లు, దేవాదాయ, వక్ఫ్ బోర్డు ఆస్తులు, భూపరిమితి చట్టం కిందకు వచ్చే వివాదాస్పద భూములు ఈ జాబితాలోకి వస్తాయి. ఈ భూములకు సంబంధించి ఎలాంటి సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ లేదా రిజిస్ట్రేషన్లు చేయడం చట్టరీత్యా చెల్లుబాటు కాదు. రిజిస్ట్రేషన్ల చట్టం 1908లోని సెక్షన్ 22A కింద ఉన్న భూములను ప్రభుత్వం నిషేధిత ఆస్తుల జాబితా గా వర్గీకరించింది. కాగా, ఇప్పుడు నెలకున్న ఆందోళన వేళ సామాన్యులు ఈ జాబితాలో తమ ఇళ్లు.. భూములు ఉన్నాయా అనే అంశం పైన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రభుత్వ పోర్టల్స్ లో పూర్తి సమాచారం
ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తిని కొనుగోలు చేసే ముందే అది 22A జాబితాలో ఉందో లేదో సొంతంగా చెక్ చేసుకోవడం అత్యంత ముఖ్యంగా భావిస్తున్నారు. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్ లో 22A జాబితా తెలుసుకొనే వెసులుబాటు కల్పించారు. ధరణి పోర్టల్‌లోని 'Prohibited Property Search' ఆప్షన్‌లో అడిగిన వివరాలు సమర్పిస్తే.. అప్పుడే సమాచారం కోరిన భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో స్పష్టత వస్తుంది. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లోని ప్లాట్లు, ఇళ్ల కోసం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసి 'Prohibited List' వివరాలను సరిచూసుకొనే అవకాశం ఉంది. ఒక వేళ 22A లో ఉంటేఅ అభ్యంతరం నమోదు చేయటం.. తిరిగి ప్రభుత్వ నిబంధనల మేరకు సొంతం చేసుకునే వెసులు బాటు కల్పిస్తున్నారు.













Click it and Unblock the Notifications