గురుకుల టీచర్ పోస్టులు: టీ.ఎస్.పీ.ఎస్.సి నోటిఫికేషన్ విడుదల..
గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీ కోసం టీఎస్.పీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణ గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీ కోసం టీఎస్.పీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి10, 2017నుంచి మార్చి04,2017 దరఖాస్తు చేసుకోవాలి.
కమిషన్ పేరు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు : పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రెయినీ గ్రాడ్యుయేట్ టీచర్
విద్యార్హత : బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, ఎం.ఏ, ఎమ్మెస్సీ, బీఈడీ
ఉద్యోగ ప్రాంతం : తెలంగాణ
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్: 921పోస్టులు
చివరి తేదీ : మార్చి04, 2017
పే స్కేల్: రూ.31460-87130/ఒక నెలకు

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ అర్హత: ఎంఏ లేదా ఎమ్మెస్సీలో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత, బీఈడీలో ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణత
ట్రెయినీ గ్రాడ్యుయేట్ టీచర్:4362
చివరి తేదీ: మార్చి04, 2017
పే స్కేల్: రూ.28940-రూ.80930/-ఒక నెలకు
విద్యార్హత: ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీలో ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్
వయసు పరిమితి: జూలై01,2017 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్ల వయసు సడలింపు, వికలాంగులకు 10ఏళ్ల వయసు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: ఓఎంఆర్ పరీక్షా విధానంతో ఎంపిక
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులంతా టీ.ఎస్.పీ.ఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి మధ్య ఫిబ్రవరి10, 2017నుంచి మార్చి04,2017 దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/9XMKaB












Click it and Unblock the Notifications