Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్!
Rain Alert: తెలంగాణలో రేపు(శనివారం) పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం.. ముందుగా అంచనా వేసిన దిశతో పోలిస్తే ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు విదర్భ ప్రాంతంలో ఏర్పడే వాయు ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

శనివారం రోజున తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భాపీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే కాకుండా వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవొచ్చని తెలిపింది. అయితే గాలి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
