వరదముంపులో మూడు గ్రామాలు- కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే సీతక్క

ములుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. హైదరాబాద్ మొదలుకుని అన్ని జిల్లాల్లోనూ ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా- వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల వల్ల అటు గోదావరి నది వరదనీటితో పోటెత్తుతోంది.

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం వరద తాకిడికి గురైంది. లక్నవరం వంతెన సైతం మునిగిపోయిందంటే వరద పోటు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని అనేక గ్రామాలను వరద ముంచెత్తింది. ఏటూరు నాగరం మండలంలోని కొండాయి గ్రామంలో వందమందికి పైగా చిక్కుకుపోయారు. మూగజీవాలు వరదనీటికి కొట్టుకుపోయాయి.

 Telangana rains: MLA Seethakka breaks down after visits flood affected areas in mulugu

ఈ సమాచారం తెలిసిన వెంటనే శాసన సభ్యురాలు సీతక్క ఏటూరు నాగారానికి చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. మోకాలి లోతు వరద నీటిలోనే కలియతిరిగారామె. ప్రతి ఇంటికీ వెళ్లారు. వారితో మాట్లాడారు. తాను ఉన్నానంటూ భరోసా కల్పించారు.

అనంతరం సీతక్క విలేకరులతో మాట్లాడారు. కొండాయి గ్రామంలో వందమందికి పైగా చిక్కుకుని ఉన్నారని, వెంటనే హెలికాప్టర్‌ను పంపించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్‌కు మీడియా ద్వారా చెబుతూనే ఉన్నామని, అయినప్పటికీ సకాలంలో సహాయం అందట్లేదని వాపోయారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

మహోగ్ర రూపంగా మారిన వాగును దాటడం సహాయక సిబ్బంది వల్ల కూడా కావట్లేదని సీతక్క పేర్కొన్నారు. అందుకే హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. వాగుకు అటువైపు ఉన్న మూడు గ్రామాల్లో వందమంది ప్రజలు ప్రమాదకర స్థితిలో ఉన్నారని, ఇప్పటికే ఆరుమంది గల్లంతయ్యారని సమాచారం వచ్చిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

బురుగుపేట్, కొండాయి, ఎలిశెట్టిపల్లి.. వంటి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఉన్నారని, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారని సీతక్క చెప్పారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన హెలికాప్టర్లను పంపించాలని కోరారు. ఆయా గ్రామాల చుట్టూ వాగులే ఉన్నాయని, అవి వరదతో పోటెత్తుతున్నాయని గుర్తు చేశారు. హెలికాప్టర్‌ను పంపించి ఆయా గ్రామాల ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+