కామారెడ్డి కకావికలం- తెలంగాణలో రైళ్లకు గండం

Heavy rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వర్షాల బారిన పడని జిల్లాలు దాదాపుగా లేవీ రెండు రాష్ట్రాల్లో. అటు హైదరాబాద్, ఇటు అమరావతి రెండు ప్రాంతాలు మునకేశాయి.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. అల్పపీడనంగా మారింది. ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతోంది. క్రమంగా ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

Telangana rains Railway track washed away near Kamareddy

ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడన ప్రభావం వల్ల తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

పరిస్థితి తీవత్రను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది విపత్తు నిర్వహణ సంస్థ. దీని టోల్ ఫ్రీ నంబర్లు.. 112, 1070, 18004250101. వర్షాలు కురిసే సమయంలో వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.

ఇదే పరిస్థితి అటు తెలంగాణలోనూ నెలకొంది. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నిర్మల్‌, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగామ, మంచిర్యాల్, హన్మకొండ, వరంగల్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలకూ భారీ వర్ష సూచన చేశారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వాతావరణ కేంద్రం అంచనాలకు అనుగుణంగా తెలంగాణలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

ఈ భారీ వర్షాల ధాటికి కామారెడ్డి సమీపంలో రైల్వే ట్రాక్ ప్రమాదకర స్థితిలో కనిపించింది. పట్టాల కింద ఉండే మట్టి కోతకు గురైంది. రైల్వే ట్రాక్ కింది నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రైల్వే ఓవర్ హెడ్ లైన్లు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫలితంగా- ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+