Telangana: మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 2వ స్థానంలో తెలంగాణ..!
అత్యధిక తలసరి ఆదాయం, అటవీ విస్తీర్ణం పెరుగుదలలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు ఇండియన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (IMII) ర్యాంకింగ్స్ 2022లో రెండో స్థానానికి చేరిందని ఓ సర్వే పేర్కొంది. ప్రధాన రాష్ట్రాల కేటగిరీలో IMII స్కోర్‌లో ఒక శాతం కంటే తక్కువ తేడాతో కర్ణాటక తర్వాతి స్థానంలో ఉంది.
నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే (NMIS), యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (UNIDO), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) సహకారంతో సర్వే నిర్వహించింది. 28 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో (లక్షద్వీప్ మినహా) ఆన్‌లైన్‌లో ఈ సర్వే నిర్వహించారు. సర్వేను రెండు నిర్దిష్ట భాగాలు చేశారు. ఒకటి సంస్థ స్థాయి సర్వే కాగా రెండోది సెక్టోరల్ సిస్టమ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ (SSI) సర్వే.

సంస్థ-స్థాయి సర్వేలో భారతదేశంలోని తయారీ సంస్థల ఆవిష్కరణ పనితీరును అంచనా వేస్తుంది. సెక్టోరల్ సిస్టమ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ సర్వేలో తయారీ సంస్థలు సమాచారం, విజ్ఞానం, సాంకేతికతలు, పద్ధతులు, మానవ, ఆర్థిక వనరులను ఎలా యాక్సెస్ చేశాయో పరిశీలించారు. ఇది ఆహారం, పానీయాలు, వస్త్రాలు, దుస్తులు, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ICT) సహా ఐదు కీలక తయారీ రంగాలపై దృష్టి సారించింది.
సర్వే ప్రకారం తెలంగాణ 32.86 IMII స్కోర్‌తో రెండవ స్థానంలో ఉంది. కర్ణాటక 33.41 స్కోర్‌తో అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ఇన్నోవేషన్ యాక్టివిటీస్, ఇన్వెస్ట్‌మెంట్‌లో కర్ణాటక, తెలంగాణలు మెరుగ్గా పనిచేస్తున్నాయని సర్వే పేర్కొంది. గత ఎనిమిదేళ్లలో రాష్ట్ర సొంత రాబడుల వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications