హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రివర్స్: మా పోలీస్‌ను పంపించాలని ఏపీ, అందర్నీ కుదరదని తెలంగాణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 10 ప్లటూన్ల పోలీసులను తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ రిలీవ్ చేసింది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో తెలంగాణలోని 42 ప్లటూన్ల తమ పోలీసులను వెనక్కి పంపించాలని ఏపీ పోలీసు శాఖ కోరింది.

అయితే, ప్రస్తుత రంజాన్, ఇతర ఉత్సవాల కారణంగా హైదరాబాదులో పోలీసులు అవసరమని తెలంగాణ పోలీసు శాఖ భావించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత, రానున్న ఉత్సవాల కారణంగా తాము కేవలం పది ప్లటూన్ల పోలీసులను మాత్రమే పంపగలమని ఏపీ పోలీసు శాఖకు సూచించింది.

ప్రస్తుతానికి పది ప్లటూన్ల పోలీసులను వెనక్కి పంపిస్తామని తెలంగాణ పోలీసులు చెప్పడంతో.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ ప్లటూన్ల పోలీసులను వెనక్కి తీసుకున్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఏపీకి అవసరమని చెబుతున్నారు.

Telangana relieve 10 platoon AP police

కాగా, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 వ్యవహారం తెలుగు రాష్ట్రాలను వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఏపీ పోలీసులకు అనుమతి లేదని తెలంగాణ, తాము అవసరమైతే పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఏపీ చెబుతోన్న విషయం తెలిసిందే.

అయితే, అందుకు విరుద్ధంగా తెలంగాణ పోలీసులు తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏఫీ పోలీసులను రిలీవ్ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అదే సమయంలో ఏపీ పోలీసులు తమ పోలీసులను అందర్నీ రిలీవ్ చేయాలని కోరడం గమనార్హం.

English summary
Telangana relieve 10 platoon AP police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X