జూన్ 11 నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మె
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సైరన్ మోగించారు. జూన్ 11 నుంచి తెలంగాణ ఆర్టీసీ సంఘాలు సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఆర్టీసీ సంఘాలు కేంద్ర కమిటీలో ఏకగ్రీవంగా నిర్ణయించాయి.
కాగా, జూన్ 7 నుంచి సమ్మె సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. వేతన సవరణ చేయనందుకు నిరసనగా ఆర్టీసీ సంఘాలు ఈ సమ్మె చేపట్టనున్నాయి. జూన్ 7వ తేదీన అన్ని డిపోల ముందు కార్మికులు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించినట్లు ఈఏ రెడ్డి తెలిపారు.

జూన్ 8వ తేదీన రీజనల్ కార్యాలయాల ముందు దీక్షలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. అప్పటికీ దిగిరాకపోతే జూన్ 11వ తేదీన సమ్మెబాట పట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆర్టీసీ సంఘాలపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం ఈ సమ్మెపై స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications