రూ.500 లకే గ్యాస్ సిలిండర్​ .. లేట్ అయినా ఖాతాల్లోకి డబ్బులు.. చెక్ చేసుకోండి..

తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకంలో మహాలక్ష్మి పథకం విశిష్టమైనది. ఈ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతోపాటు రూ. 500లకే వంట గ్యాస్ సిలిండర్ ను సరఫరా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాయితీ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అధికారులు. అయితే ఈ రాయితీ నగదును ప్రతీ నెల కాకుండా రెండు, మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు.

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. అయితే రాయితీ డబ్బులు విడుదలలో కొంత జాప్యం నెలకొన్న నేపథ్యంలో.. తాజాగా రాయితీ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ రాయితీ నగదును ప్రతి నెల కాకుండా రెండు, మూడు నెలలకోసారి నగదును జమ చేస్తున్నారు. అంతేకాదు ఒక్కో లబ్ధిదారుకు మూడు, నాలుగు సిలిండర్ల రాయితీ ఒకేసారి జమ అవుతోంది. కాస్త ఆలస్యం అయినా మరుసటి నెలలో నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అధికారులు.

రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో ప్రతి నెలా క్రమంగా నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేది. అయితే కొందరు లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్​ నంబర్లు తప్పుగా ఇవ్వడంతో వారికి చెల్లింపులు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మొత్తం రూ.150-180 కోట్ల వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Telangana s Mahalaxmi Scheme Gas Cylinders at 500 Subsidy Payments Underway

ఇక వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.915గా ఉనట్లు సమాచారం. మహాలక్ష్మి స్కీమ్​ లబ్ధిదారులు ఆ మొత్తం చెల్లించి గ్యాస్‌ సిలిండర్​ తీసుకుంటుండగా, ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.375 సబ్సిడీ అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్‌ కార్డుల ఆధారంగా గ్యాస్‌ సబ్సిడీకి 39.57 లక్షల మంది అర్హులుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+