తెలంగాణలోని ఉప సర్పంచ్ లకు బిగ్ షాక్..?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 22 న కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్స్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉప సర్పంచ్ లకు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉప సర్పంచ్‌ కు చెక్ పవర్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా ఎన్నికైన ఉప సర్పంచులకు తీరని నిరాశను మిగిల్చిందని చెప్పొచ్చు.

తెలంగాణ రాష్ట్రంలోని ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2025 పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి విపరీతమైన డిమాండ్ పెరగడానికి ఈ 'జాయింట్ చెక్ పవర్' ప్రధాన కారణమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా ఎన్నికైన ఉప సర్పంచులకు తీరని నిరాశను మిగిల్చిందని చెప్పొచ్చు.

2018 లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయత్ రాజ్ చట్టం ప్రకారం.. గ్రామంలో పనులకు నిధులు విడుదల కావాలంటే సర్పంచ్ అలాగే ఉప సర్పంచ్ కు జాయింట్ చెక్ పవర్ అధికారం ఉండేది. సర్పంచ్ తో పాటుగా ఉప సర్పంచ్ కూడా సంతకం చేస్తేనే నిధులు విడుదల జరిగేది. అయితే తాజాగా ఈ హోదాను ఉప సర్పంచ్ లకు రద్దు చేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉప సర్పంచ్ లు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ జీవోను ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. దీనిపై తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ఇటువంటి ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని పేర్కొంది.

Telangana Shocker Govt Revokes Cheque Signing Powers of Deputy Sarpanches Statewide

ఇక ఇటీవలే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరిన విషయం తెలిసిందే. డిసెంబర్ 22 న కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ లు ప్రమాణస్వీకారాలు చేశారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాధ్యతలను వారికి అప్పజెప్పారు. దాంతో గ్రామాల్లో ఇప్పటి వరకు కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలన సర్పంచ్ లు, వార్డు సభ్యుల రాకతో ముగిసిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+