రేవంత్ సింగపూర్ టూర్ లో కీలక ఒప్పందం..!!

ముఖ్యమంత్రి రేవంత్ సింగపూర్ పర్యటనలో కీలక ఒప్పందం జరిగింది. దావోస్ పర్యటనకు ముందు రేవంత్ సింగపూర్ లో ప్రముఖులతో భేటీ అయ్యారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివి యన్‌ బాలకృష్ణతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా మౌలిక వసతుల అభివృద్ధి, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక రంగం సహా పలు విభాగాల్లో భాగస్వామ్యంపై చర్చిం చారు. అనంతరం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ సింగపూర్ ఐటీఈ తో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది.

ముఖ్యమంత్రి రేవంత్ సింగపూర్ పర్యటనలో భాగంగా కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ సారి తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన చేస్తున్నారు. రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో సమావేశాలకు హాజరవుతున్నారు. యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో ఎంఓయు కుదుర్చుకుంది. సింగపూర్ ఐటిఇ పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి నుంచి, చదువు పూర్తి చేసిన యువతకు నిపుణ్యం కలిగిన విద్యను అందించాలని నిర్ణయించారు.

Telangana skill university MOU with ITE-Singapore in CM Revanth Tour details here

స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్‌లైన్, క్యాంపస్ శిక్షణ దొరుకుతుంది. ఐటిఈకి ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. పరిశ్రమలు తమకు అవస రమైన మానవ వనరులకు నేరుగా శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అదే స్పూర్తితో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తన శిక్షకులకు ఐటిఈతో ట్రెయినింగ్ (ట్రెయినింగ్ ఫర్ ట్రెయినర్స్) ఇప్పించేలా ఒప్పందరం కుదుర్చుకుంది.
తాజా ఎంఓయు వల్ల సింగపూర్ ఐటిఇ పాఠ్యాంశాలను (కరికులమ్) మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

సింగపూర్ లో మూడు రోజుల పర్యటన తరువాత రేవంత్ టీం దావోస్ చేరుకుంటుంది. అక్కడ
వరల్డ్ ఎనకామిక్‌ ఫోరమ్‌ వార్షిక సదస్సులో తెలంగాణ పెవిలియన్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌‌గా తీర్చి దిద్దారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే టార్గెట్‌గా సీఎం రేవంత్ పర్యటన సమావేశాలు.. షెడ్యూల్ ఫిక్స్ అయింది. దావోస్ వేదికగా ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. గత ఏడాది రేవంత్ దావోస్ కు వెళ్లారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం గురించి వివరించి.. పెట్టుబడి దారులను తెలంగాణ కు ఆహ్వానించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+