మరోసారి: వాట్సాప్ ద్వారా సైన్స్ ప్రశ్నాపత్రం బయటకు, అరెస్ట్
నిర్మల్: పదో తరగతి పరీక్షలలో ప్రశ్నాపత్రాల లీకేజీ కలకలం కొనసాగుతోంది. తాజాగా, శుక్రవారం నిర్మల్ ఖానాపూర్‌లో సైన్స్ ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇందుకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసారు. వాట్సాప్ ద్వారా దీనిని లీక్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ ప్రయివేటు స్కూల్ టీచర్ లీకేజీలో కీలకంగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా, ఇంతకుముందే ఇంగ్లీష్, మ్యాథ్స్ ప్రశ్నా పత్రాల లీకేజీ కలకలం చోటు చేసుకుంది. మొదట అదిలాబాద్, వనపర్తిలలో ఇంగ్లీష్, జగిత్యాలలో మ్యాథ్స్ పేపర్ లీకయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications