Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ మద్దతుతో వరంగల్లో గెలుస్తాం: రమణ, బిజెపి అభ్యర్థికి హామీ ఇవ్వని బాబు

విజయవాడ: వరంగల్ ఉప ఎన్నికల్లో తాము జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకుంటామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గురువారం నాడు విజయవాడలో చెప్పారు.

ఎల్ రమణ, వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్డీయే (బిజెపి-టిడిపి) అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవయ్య తదితరులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా ఎల్ రమణ విలేకరులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకుని ఉప ఎన్నికలో విజయం సాధిస్తామన్నారు.

ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి పూర్తి సహకారం అందిస్తున్నామని తాము తమ పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలే తమ ప్రచార అస్త్రాలు అని చెప్పారు. బిజెపి అభ్యర్థికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు.

వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి దేవయ్య మాట్లాడుతూ... వరంగల్‌ను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాగా, వరంగల్‌లో తాను ప్రచారం చేసే విషయంపై పవన్ కళ్యాణ్ ఇంతవరకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రచారం చేసే అవకాశాలు లేవని చెబుతున్నారు.

 Telangana TDP Leaders meet with CM Chandrababu Naidu

వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి గెలిస్తే తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని టిడిపి అధినేత చంద్రబాబు తనను కలిసిన తెలంగాణ టిడిపి నేతలతో చెప్పారు. వరంగల్, నారాయణఖేడ్ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు తదితర అంశాలపై వారు చర్చించారు.

తెరాస ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ... ఇప్పటికే వరంగల్ సభల్లో టిఆర్ఎస్ నేతలను, మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. బిజెపి నేతలతో కలిసి తెలంగాణ టిడిపి నేతలు ఐక్యంగా ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు.

చంద్రబాబును కలిసిన వారిలో ఎన్డీయే అభ్యర్థి దేవయ్య దంపతులు, బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, టిడిపి నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ తదితరులు ఉన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి రావాలని దేవయ్య.. చంద్రబాబును కోరారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ.. తర్వాత చెబుతానని అన్నారు. కాగా, చంద్రబాబు కూడా ప్రచారం చేసే అవకాశాలు లేవంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+