కేసీఆర్! ఏం పుట్టింది, రాజీనామా చేసి రా!! (పిక్చర్స్)
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెడలు వంచి ఛాతి ఆసుపత్రిని నిలబెడతామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ సోమవారం హెచ్చరించారు. సచివాలయాన్ని మార్చాలంటే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.
కేసీఆర్ నిరంకుశ, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు కొమ్ము కాయడానికే ఆసుపత్రిని తరలించడానికి పూనుకున్నారన్నారు. గత్యంతరం లేక ఫాస్ట్ పథకాన్ని ఎత్తివేసినట్టే సచివాలయం తరలింపు విషయాన్ని కూడా రద్దు చేసుకోవాలని కోరారు.
ఛాతీ ఆసుపత్రి తరలింపు జీవోను కేసీఆర్ ఉపసంహరించుకునే వరకూ పోరాడతామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని గ్రేటర్ అధ్యక్షుడు కృష్ణయాదవ్ అన్నారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని పెద్దిరెడ్డి అన్నారు.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు
ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ఉన్న స్థలంలోకి తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని తరలించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై తెలుగుదేశం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు
టీడీపీ నేతలు సోమవారం ఛాతి ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రిని కదిలిస్తే ఉరోమని, అడ్డుకుంటామని టీ-టీడీపీ నేతలు హెచ్చరించారు.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు
నిజాంను మించిపోతున్నారంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు నేతృత్వంలోని ఆ పార్టీ బృందం సోమవారం ఛాతీ ఆస్పత్రిని సందర్శించింది. ఆస్పత్రి తరలింపుపై ఉద్యమిస్తున్న వైద్య, వైద్యేతర సిబ్బందికి సంఘీభావం తెలిపింది.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు
ఇప్పుడు ఎనిమిది జిల్లాలకు అందుబాటులో ఉన్న ఛాతీ ఆస్పత్రి తరలింపు తరువాత ఒకే జిల్లాకు పరిమితం అవుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా కేసీఆర్! ఏం పుట్టింది మీకు? ఎందుకు ఇలా అలోచిస్తున్నారు? ఛాతీ ఆసుపత్రి తరలించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు
ఇంటికి, రూముకు వాస్తు ఉంటుందేగానీ ఎక్కడైనా ప్రభుత్వానికి వాస్తు ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిచ్చోడి చేతిలో రాయులా కేసీఆర్ చేతిలో రాజ్యం ఉందన్నారు. సచివాలయానికి కాదు దోషం... నీవు సీఎం కావడంలోనే దోషం ఉందని, నీ ఆలోచన విధానంలో దోషముందన్నారు.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు
నిజాం మాదిరిగా నీ ముద్ర వేసుకోవాలని చేస్తున్నావని, ఆయన మంచి కోసం కట్టడాలు కట్టాడని, నీ నిర్ణయంతో పాడు చేయకని హితవు పలికారు. గతంలో ప్రభుత్వ భూమి ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కాకుండా ఎన్టీఆర్, చంద్రబాబు కాపాడితే, కేసీఆర్ వాస్తుపేరుతో ఉన్న భూమిని అమ్ముకుంటున్నారని విమర్శించారు.

ఛాతి ఆసుపత్రిలో తెలంగాణ టీడీపీ నేతలు
సచివాలయం ఉన్న స్థలంలో బంధువుల కోసం ఫైవ్ స్టార్ ఆసుపత్రిని నిర్మించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని ఆరోపించారు. ఛాతీ ఆసుపత్రిని జనరల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications