తెలంగాణలో టీచర్లకు గుడ్‌న్యూస్

తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది. శనివారం నుంచి ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు ప్రారంభం కానున్నాయి. పదవీ విరమణకి 3 ఏళ్లలోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు నిచ్చింది.

పండిట్, పీఈటీ పోస్టులలో అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మల్టీ జోన్ 2లో హెచ్‌ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1 లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌తో షెడ్యూల్ మొదలు కానుంది. మల్టీ జోన్ 1లో జూన్ 8 నుంచి జూన్ 22 వరకు బదిలీలు, పదోన్నతులు కల్పించనున్నారు.

Telangana teachers transfers and promotions schedule released

అలాగే మల్టీ జోన్ 2లో రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపొయిందో అక్కడి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించనున్నారు. టెట్‌తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

కొత్త కోర్సు ప్రవేశపెట్టిన విద్యా శాఖ

ప్రస్తుతం ఉన్న ఉపాధి అవకాశాల దృష్ట్యా బీఎస్సీలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ ఆనర్సు కోర్సును ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులకు పరిశ్రమ, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో ఈ వృత్తివిద్యా కోర్సును ప్రారంభిస్తున్నట్టు స్ఫష్టం చేసింది.

2024-25 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురానున్న ఈ కోర్సుకి సంబంధించిన సిలబస్​ని ఇప్పటికే రూపొందించినట్టు తెలిపారు. ఆస్పత్రులు, ఫార్మా సంస్థల సహకారంతో విద్యార్థులకు ఇంటర్న్​ షిప్​లు, కోర్సు ప్రాక్టికల్స్‌​ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఒప్పందాలు పూర్తి చేసుకున్నట్టు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు.

ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ మహమూద్, ప్రొఫెసర్ శ్రీరాం, రెడ్డీస్ లేబొరేటరీస్, ఎంఎస్ఎన్ లేబొరేటరీస్, ఫార్మా డీఈఎం సొల్యూషన్స్ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు. ఉస్మానియా, నిమ్స్, మహావీర్ ఆస్పత్రుల సీనియర్ వైద్యులు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+