తెలంగాణకు బీసీ సీఎం ఖాయం- టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి అవుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రత్యర్థి బీఆర్ఎస్ ను సీఎం రేవంత్ టార్గెట్ చేస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ - ప్రభుత్వం లోనూ ప్రక్షాళన కు సిద్దమయ్యారు. రానున్న రోజుల్లో వరుస ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణకు బీసీ సీఎం ఖాయం అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణకు బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారన్న ధైర్యాన్ని ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్రలో కల్పించారని వ్యాఖ్యానించారు. అగ్ర వర్ణాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మద్దతుతో బీసీలకు దక్కాల్సిన వాటాను తీసుకుంటామని, అవసరమైతే తమ హక్కుగా పోరాడి లాక్కుంటామని స్పష్టం చేశారు. టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో సింహగర్జన సభలో మహేష్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేసారు. బీసీలకు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మద్దతు ఉంటుందని, వారి సహకారంతో రాష్ట్రంలో బీసీ నేత సీఎం అవుతారని పేర్కొన్నారు. పీవీ నర్సింహారావు, మర్రి చెన్నారెడ్డి మాదిరిగా రేవంత్‌ బీసీలకు మద్దతు పలికారని, అసెంబ్లీలో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై చర్చించి తీర్మానాన్ని కేంద్రానికి పంపారని గుర్తు చేశారు.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖరారు- రేవంత్ అనూహ్య ఎంపిక, బీఆర్ఎస్ 'ఫిక్స్'..!!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖరారు- రేవంత్ అనూహ్య ఎంపిక, బీఆర్ఎస్ 'ఫిక్స్'..!!
telangana-to-have-bc-chief-minister-says-tpcc-chief-mahesh-kumar-goud-leads-to-new-discussion

మహేష్ కుమార్ తాజా వ్యాఖ్యలతో

ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రంతో ఆమోదం పొందేలా రాష్ట్రం నుంచి గెలిచి న బీజేపీ దద్దమ్మలు కృషి చేయలేదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో యావత్‌ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, ప్రధాని మోదీ చేపట్టిన కులగణన తూతూ మంత్రంగా చేపడుతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ఓబీసీలు ఏకమై బీజేపీని గద్దె దింపుతారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ బీసీల వ్యతిరేకి అని, తెలంగాణను దోచుకున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. 2039 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కులగణన కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నది తమ ప్రధాన డిమాండ్‌ అని, గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కులగణన కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+