'ప్రపంచానికి దారిచూపేలా భారత్ సమ్మిట్ 2025'
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు భారత్ సమ్మిట్ 2025.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 25, 26 తేదీల్లో'భారత్ సదస్సు-2025' నిర్వహించనుంది. ఈ సమ్మిట్ లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతేకాక 100కు పైగా ప్రగతిశీల రాజకీయ పార్టీలు, 40 నుంచి 50 మంది వరకు మంత్రులు, మరో 50 మంది వరకు ఎంపీలు, సెనేటర్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

అయితే తాజాగా భారత్ సమ్మిట్ 2025 కు తగిన ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం పోస్ట్ చేసింది. ప్రపంచానికి దారి చూపేలా భారత్ సమ్మిట్ 2025 అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక హైదరాబాద్ వేదికగా నిర్వహించబోయే భారత్ సమ్మిట్ 2025 అనేది చరిత్రలో నిలిచిపోతుందని తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భట్టి అన్నారు. సమ్మిట్ నిర్ణయాలను తెలంగాణలో అమలు చేస్తామని.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేస్తామని తెలిపారు. దీంతో ఈ సదస్సుపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.
ప్రపంచానికి దారిచూపేలా భారత్ సమ్మిట్ 2025.#BharatSummit2025 pic.twitter.com/X6n5Nw6Jou
— Telangana Congress (@INCTelangana) April 24, 2025
100కు పైగా దేశాల నుంచి 400మందికి పైగా రాజకీయ, ఆర్థిక ,సామాజిక స్థితిగతుల లో నిష్టాతులైన వారు సమ్మిట్ కు హాజరవుతారని సమాచారం. రాజకీయ పార్టీలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొననునన్నట్లు సమాచారం. ఈ సదస్సులో అంతర్జాతీయ న్యాయం, సమానత్వం అంశాలపై ద్వైపాక్షిక, సైద్ధాంతిక చర్చలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ప్యానెల్ చర్చలు ఉంటాయి. ఏప్రిల్ 25 తేదీన హైదరాబాద్ డిక్లరేషన్ ను ఆవిష్కరించనున్నారు.












Click it and Unblock the Notifications