కొత్త వాహనాలు కొనే వారికి బిగ్ షాక్, ఇక భారీగా బాదుడు- రేటు ఫిక్స్..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక కొత్తగా బైక్.. కారు.. ఎలాంటి వాహనం కొన్నా అదనపు భారం తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం వాహన కొనుగోలు దారుల నుంచి రహదారి భద్రతా సెస్సు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఏ వాహనం కొనుగోలు చేస్తే ఎంత మేర సెస్సు కట్టాల్సి వస్తుందో వివరించింది.
తెలంగాణ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ సెస్సు విధింపుకు సిద్దమైంది. ఈ మేరకు శాసనసభ, మండలిలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, ఆదేశాలు అమలులో భాగంగానే రహదారి భద్రతా సెస్సును వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే కొత్త ద్విచక్ర వాహనాలపై రూ.2 వేలు, కార్లపై రూ.5 వేలు, భారీ వాహనాలపై రూ.10 వేల చొప్పున రోడ్డు భద్రతా సెస్సును విధించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంది. సరుకు వాహనాలపై ఇప్పటివరకు వసూలు చేస్తున్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)గా 7.5 శాతం వసూలు చేస్తామని వెల్లడించారు.

కాగా, లైసెన్స్ విధానాన్ని కఠినతరం చేస్తున్నామని, డ్రైవింగ్ నైపుణ్యాలు గుర్తించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించి, మరణాలను తగ్గించడమే లక్ష్యంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వాహనాలపై లైఫ్ ట్యాక్స్‌ను పెంచుతూ గత ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రహదారి భద్రత సెస్సును ప్రవేశపెట్టింది.
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇది అదనపు భారంగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాలలు కలిపి ఏటా 9 లక్షల వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. అంటే రహదారి భద్రతా సెస్సు వసూలుతో ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల వరకు ఆదాయం సమకూర నుంది. తాజా నిర్ణయతో ఇక బండి కొనుగోలు చేసే సమయంలో 2 వేలు అదనపు భారం, చిన్న కార్లు కొనుగోలు చేసే కుటుంబాలపై 5వేల భారం పడుతుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications