Telangana Weather : తెలంగాణలోని ఆ జిల్లాల్లో 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు

ప్రస్తుతం తెలంగాణలో పశ్చిమ,నైరుతి గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ,ఈశాన్య,తూర్పు జిల్లాల్లో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు,మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాగల 24గంటల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ ఉత్తర భాగంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్‌,ఇల్లందు,బయ్యారం,భద్రాచలం ప్రాంతాల్లో 4సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల 1సెం.మీ నుంచి 3సెం.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఉష్ణోగ్రత విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో గరిష్ఠంగా 34డిగ్రీలు,కనిష్ఠంగా 25.4డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండలో 35.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత,అత్యల్పంగా భద్రాచలంలో 25డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

telangana weather report light to moderate rains in the state for five days

జూన్ 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 30శాతం(441మి.మీ) సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపింది. సాధారణంగా ఈ పీరియడ్‌లో 574మి.మీ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది.

గత కొద్దిరోజులుగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు,వంకులు పొంగిపొర్లిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వచ్చిన వరదతో కృష్ణా నది పరవళ్లు తొక్కింది. దీంతో శ్రీశైలం,నాగార్జున సాగర్ గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గేట్లు మూసివేశారు. సాధారణంగా కృష్ణా నదికి ఈ స్థాయిలో వరద రావడం అరుదని చెబుతారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి అవసరాలు ఎక్కువగా ఉండటం.. ఆ స్థాయిలో నీటి లభ్యత లేక రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండటంతో రాష్ట్రాల నీటి అవసరాలు పూర్తి స్థాయిలో తీరే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+