చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. రుణమాఫీపై కీలక ప్రకటన
Telangana: తెలంగాణ సర్కారు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా చేనేత కార్మికులకు కూడా రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.లక్ష వరకు చేనేత కార్మికులకు రుణమాఫీ అమలుకు సిద్ధమైంది. దీనికోసం అవసరమైన రూ.33 కోట్లు మంజూరు చేస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ తరఫున ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.33 కోట్లను చేనేత కార్మికులకు రుణమాఫీగా చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2025-26 బడ్జెట్ నిధుల నుంచి రుణమాఫీకి సంబంధించి మొత్తాన్ని విడుదల చేయనున్నారు.
చేనేత రుణమాఫీ పథకం కింద 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు చేనేత కార్మికులు వివిధ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తిస్తుంది. చేనేత వస్త్రాల ఉత్పత్తి, నిర్వహణ మూలధనం, ఇతర చేనేత వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలు దీని పరిధిలోకి వస్తాయి. రుణమాఫీ అమలు కోసం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీని.. చేనేత డైరెక్టర్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి కమిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత రుణమాఫీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

మరోవైపు చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు అవసరం అయిన రూ.33 కోట్లకు చెందిన పరిపాల అనుమతులు జారీ అయ్యాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో మల్లికార్జున ఖర్గే గ్రామ శాఖల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగిస్తూ.. చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. చేనేత కార్మికుల వివరాలను సేకరించి వెరిఫికేషన్ ప్రక్రియ చేస్తున్నామని.. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే చేనేత కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. అలాగే రూ. లక్ష రుణమాఫీ పూర్తయిన తర్వాత.. అవసరం ఉన్న కార్మికులు మళ్లీ వెంటనే రుణం తీసుకోవచ్చని వెల్లడించారు. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇందిరా మహిళా శక్తి పథకం కింద సిరిసిల్లలోని 16 వేల మగ్గాలకు నిరంతరం పని కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications