కెల్విన్‌తో పరిచయంపై పూరీ జగన్నాథ్ షాకింగ్, కానీ: పూరీతోనే రవితేజ, చార్మిలకు..
డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సిట్ విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సిట్ అధికారులు ఆయనకు తొలి రెండు గంటల్లోనే చుక్కలు చూపించారని సమాచారం.
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సిట్ విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సిట్ అధికారులు ఆయనకు తొలి రెండు గంటల్లోనే చుక్కలు చూపించారని సమాచారం.

కెల్విన్ తెలుసు కానీ..
విచారణ సందర్భంగా కెల్విన్‌తో తనకు పరిచయం ఉందని పూరి చెప్పాడని తెలుస్తోంది. తొలుత కెల్విన్ తెలియదని చెప్పే ప్రయత్నాలు చేశారు. కాని అధికారులు ఉక్కిరిబిక్కిరి చేయడంతో చివరకు కెల్విన్ తెలుసునని ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
Recommended Video


అలా పరిచయం
ఓ మిత్రుడి ద్వారా పరిచయమయ్యాడని చెప్పాడు. అయితే, కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తాడని ఆ తర్వాత తెలిసిందని చెప్పాడు. కెల్విన్ పరిశ్రమలో కొందరికి డ్రగ్స్ సరఫరా చేస్తాడనే విషయం తర్వాత తెలిసిందని పూరీ చెప్పాడని సమాచారం. కానీ కెల్విన్ గురించి పూర్తిగా, స్పష్టంగా చెప్పలేదు.

పబ్ కల్చర్ సహజమే
అలాగే తనకు సినిమా వాళ్లు తప్ప బయటివాళ్లు ఎక్కువగా తెలిపాడని సమాచారం. పబ్బులకు వెళ్లే అలవాటు ఉందని చెప్పాడు. కెల్విన్ పబ్బులో పరిచయం అయ్యాడా అని అధికారులు ప్రశ్నించగా.. సినీ పరిశ్రమలో పబ్ కల్చర్ సహజమేనని చెప్పాడని తెలుస్తోంది. తద్వారా కెల్విన్ పబ్బులో పరిచయమయ్యాడని చెప్పారు.

వీటిపై ప్రశ్నలు
పూరీ జగన్నాథ్‌ను అధికారులు పలు కోణాల్లో విచారించారని తెలుస్తోంది. పూరీ పర్సనల్ లైఫ్, సినిమా పరిశ్రమ, డ్రగ్స్ వ్యవహారం గురించి అధికారులు అడిగారని తెలుస్తోంది.

అరెస్ట్ చేయకపోవచ్చు, పూరీతోనే రవితేజ, చార్మీలకు..
పూరీని అరెస్ట్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. కెల్విన్‌తో ఉన్న సంబంధాలు, సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపై ఇతర కోణాల్లో దర్యాప్తు చేసేందుకే ఈ విచారణ చేపట్టారు. ఆయన ఇచ్చిన సమాచారాన్ని తదుపరి దర్యాప్తునకు ఉపయోగించుకొని, ఆయనను సాక్షిగా పేర్కొనే అంశంపై అధికారులు ఓ నిర్థారణకు రానున్నారు. కెల్విన్ తెలిసినప్పటికీ, డ్రగ్స్ ముఠాతో ఎలాంటి సంబంధం లేదని పూరీ ఇప్పటికే అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. పూరీ ద్వారానే ఛార్మి, రవితేజకు డ్రగ్ ముఠాతో సంబంధాలు ఏర్పడినట్టు అధికారులు భావిస్తున్నారు.

సినిమా గురించి.. ప్రస్తుత కల్చర్ చూపిస్తా..
తన సినిమాల గురించి అధికారులకు పూరీ పలు విషయాలు వెల్లడించారు. సినిమాల్లో పబ్ కల్చర్ సహజమేనని చెప్పారు. తనకు సినిమాలే ప్రపంచం అని తెలిపారు. సినిమాల కోసమే తన బృందంతో కలిసి బ్యాంకాక్ వెళ్తామన్నారు. పబ్స్, విదేశాలకు వెళ్లడం తనకు అలవాటు అని చెప్పారు. తన సినిమాల్లో ప్రస్తుత కల్చర్ చూపిస్తానని చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications