బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ పోటీ..

Sheshabhattar Sheshendra: పార్లమెంట్ ఎన్నికల కోసం.. బ్రిటన్ సర్వ సన్నద్ధమౌతోంది. ఈ ఎన్నికలు ఎంతో దూరంలో కూడా లేవు. జులై 4వ తేదీన అక్కడ పోలింగ్ షెడ్యూల్ అయింది. భారత్ తరహాలోనే అయిదేళ్లకోసారి ఈ ఎన్నికలు నిర్వహిస్తారక్కడ. మే 30వ తేదీన ప్రస్తుత పార్లమెంట్ రద్దయింది.

650 సీట్లు ఉన్న బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 326. భారతీయ మూలాలు ఉన్న ప్రధానమంత్రి రిషి సునాక్ సారథ్యంలో ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. 2019 నాటి ఎన్నికల్లో ఈ పార్టీకి దక్కిన సీట్ల సంఖ్య 344. 205 మంది సభ్యుల బలంతో లేబర్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది.

Telugu origin Sheshabhattar Sheshendra is contesting Britain Parliament elections

స్కాటిష్ నేషనల్ పార్టీ- 43, లిబరల్ డెమొక్రాట్స్- 15, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ- 7, సిన్ ఫెయిన్- 7 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎన్నికల ప్రచారపర్వం విస్తృతంగా సాగుతోంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉంది కన్జర్వేటివ్ పార్టీ. బోరిస్ జాన్సన్, థాచర్ మే, డేవిడ్ కామెరాన్, జాన్ మేజర్, మార్గరెట్ థాచర్.. వంటి హేమాహేమీలను అందించిన పార్టీ ఇది.

ఈ ఎన్నికల్లో తెలుగు వ్యక్తి పోటీ చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనే- శేషభట్టార్ శేషేంద్ర. తెలంగాణకు చెందిన వ్యక్తి. 21 సంవత్సరాలుగా బ్రిటన్‌లో నివసిస్తోన్నారు. ఆ దేశ పౌరసత్వం ఉందాయనకు. 2003లో ఆయన ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లారు.

షెఫీల్డ్‌లో నివసిస్తూ ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న తరువాత ఐటీ కంపెనీని నెలకొల్పారు. పర్యావరణ ఏజెన్సీని స్థాపించారు. అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సోలిహుల్‌కు షిఫ్ట్ అయ్యారు. స్థానిక ప్రభుత్వ విద్యాసంస్థలో పేరెంట్ గవర్నర్‌గా సేవలను అందించారు.

లవ్ సోలిహుల్ కోఆర్డినేటర్‌గా క్లీన్ సిటీగా మార్చడంలో కీలక పాత్ర పొషించారు శేషభట్టార్. 2015లో తెలంగాణ యూరప్ కల్చరల్ అసోసియేషన్‌ను నెలకొల్పారు. బ్రిటన్‌లో స్థిరపడిన తెలుగువారి కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. నేరాలు, దొంగతనాలను అరికట్టడానికి 2018లో ప్రత్యేకంగా స్ట్రీట్ వాచ్‌ అనే అసోసియేషన్‌ను నెలకొల్పారు. ఆయన సామాజిక సేవను గుర్తించి, వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ 2022లో గుడ్ సిటిజన్ అవార్డును ఇచ్చింది.

2021లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గ్రీన్ పార్టీలో చేరారు. సోలిహుల్ మెట్రోపాలిటన్ బారో కౌన్సిల్‌కు కౌన్సిలర్‌గా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గ్రీన్ పార్టీ తరఫున మెరిడెన్ అండ్ సోలిహుల్ ఈస్ట్‌ స్థానాల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+