తెలుగురాష్ట్రాల్లో ఘనంగా రాఖీ పండగ, గవర్నర్ దంపతులకు చిన్నారుల రాఖీ, కేటీఆర్, జగన్‌కు కూడా
హైదరాబాద్ : రక్షాబంధన్. అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీరూపం. చెల్లెలికి అండగా ఉన్నా అని అన్న ఇచ్చే భరోసా. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఏటా జరుపుకునే వేడుకే రాఖీ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. పురణాల్లో రాఖీ పౌర్ణమికి పలు నేపథ్య గాధలు ఉన్నాయి. సనాతన హిందూ ధర్మానికి చెందిన పండుగ. కానీ రాజకీయ, సినీ ప్రముఖులు మతాలకు అతీతంగా ఫెస్టివల్ జరుపుకుంటున్నారు.

రాఖీ వేడుక ..
రాజ్‌భవన్‌లో రాఖీ సెలబ్రేషన్స్ జరిగాయి. గవర్నర్ దంపతులకు రాఖీ కట్టారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాఖీ కట్టేవారిని అనుమతించారు. దీంతో స్కూల్ విద్యార్థులు, చిన్నారులు, యువతులు గవర్నర్ నరసింహన్, విమలా నరసింహన్‌కు రాఖీ కట్టారు. వీరిలో క్రిస్టియన్ విద్యార్థులు కూడా ఉండటం విశేషం. వారికి గవర్నర్ దంపతులు రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువు కాలకాలం తోడుండాలని కోరుకునే పండుగే రాఖీ పౌర్ణమి.

కేటీఆర్ అన్న ..
తెలంగాణ భవన్‌లో జెండా వందనం పూర్తయ్యక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాఖీ కట్టారు యవతులు. వారికి కేటీఆర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్న తోడుంటానని వారికి మాటిచ్చారు. కేటీఆర్ తర్వాత ఆ పార్టీ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ తదితర నేతలకు రాఖీ కట్టారు మహిళలు.

కేసీఆర్‌కు రాఖీ.. కేటీఆర్ అన్న ..
సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టారు అతని అక్కచెల్లెళ్లు. సీఎం కేసీఆర్‌కు ఏడుగురు అక్కాచెల్లెళ్లు .. రాఖీ కట్టాక అక్కల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. తెలంగాణ భవన్‌లో జెండా వందనం పూర్తయ్యక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాఖీ కట్టారు యవతులు. వారికి కేటీఆర్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్న తోడుంటానని వారికి మాటిచ్చారు. కేటీఆర్ తర్వాత ఆ పార్టీ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ తదితర నేతలకు రాఖీ కట్టారు మహిళలు.

జగన్ అన్న .. చంద్రబాబు
ఇటు అమరావతిలో ఏపీ సీఎం జగన్‌కు మహిళలు రాఖీ కట్టారు. వారిని జగన్ విష్ చేశారు. మీకు అన్నివిధలా అండగా ఉంటానని హామీనిచ్చారు. మరోవైపు హైదరాబాద్‌లో మాజీ ఏపీ సీఎం చంద్రబాబుకు రాఖీ కట్టారు యువతులు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications