ఆస్ట్రేలియాలో హైదరాబాద్ లేడీ టెక్కీ సుప్రజ మృతి: మిస్టరీనే!
హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని సాఫ్టువేర్ ఉద్యోగిగా పని చేస్తున్న తెలంగాణకు చెందిన యువతి సుప్రజ మృతిపై పోలీసులు మాట్లాడుతూ.. డొక్లాండ్స్ వద్ద ఉదయం పూట (గురువారం) 31 ఏళ్ల మహిళ, నాలుగు నెలల చిన్నారి విగతజీవులుగా కనిపించారని చెప్పారు.
భార్య, కొడుకు మృతి నేపథ్యంలో భర్త శ్రీనివాస్ డిప్రెషన్‌కు గురయ్యారని చెప్పారు. పోలీస్ టీం విచారణ జరుపుతోందన్నారు. ఇప్పటి వరకు ఎవరికి కూడా వారి మృతికి కచ్చితమైన కారణాలు తెలియలేదని చెప్పారు. అతను టెక్ మహీంద్రాలో పని చేస్తున్నారు. ఆ కుటుంబానికి కంపెనీ అండగా నిలిచింది.
కాగా, సుప్రజ, ఆరు నెలల కొడుకు పదిన్నర గంటల ప్రాంతంలో స్పెన్సర్స్ వీధిలోని బిల్డింగ్ పై నుంచి వీరు కిందపడ్డారు. మెల్ బోర్న్ పోలీసులు అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సుప్రజను, ఆమె బిడ్డను ఎవరైనా తోసేశారా, లేక వారే కిందపడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ గంగాధర్‌కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాస్‌కు హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి కూతురు సుప్రజతో తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది.
గత పదేళ్లుగా శ్రీనివాస్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం శ్రీనివాస్ కుటుంబంతో సహా ఆస్ట్రేలియా వెళ్లాడు. సుప్రజ గర్భిణిగా ఉండటంతో డిసెంబర్ నెలలో శ్రీనివాస్ తల్లిదండ్రులు గంగాధర్, ఇందిర మెల్బోర్న్ వెళ్లారు. సుప్రజకు ఆరు నెలల క్రితం కొడుకు జన్మించాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులు ఆర్మూర్ తిరిగొచ్చారు.
శ్రీనివాస్, సుప్రజలు ఈ నెలలోనే నిజామాబాద్ రావాల్సి ఉంది. ఈ లోపే సుప్రజ మృతి చెందింది. ఘటన పైన బంధువులు మాట్లాడుతూ.. శ్రీనివాస్ - సుప్రజలు అన్యోన్యంగా ఉంటారని, ఎలాంటి గొడవలు లేవని చెబుతున్నారు. తమ దగ్గర వీసా, పాస్ పోర్టు లేకపోవడం వల్ల వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. మరోవైపు, శ్రీనివాస్ తండ్రి గురువారం రాత్రి మెల్బోర్న్ బయలుదేరారు.
మాకు సంబంధం లేదు: సుప్రజ తండ్రి
సుప్రజతో, ఆమె కుమారుడితో తమకు సంబంధం లేదని ఆమె తండ్రి శంకరయ్య అన్నారు. ఆయన మెదక్ జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పని చేసి పదవీ విరమణ పొందారు. చందానగర్ రెడ్డి కాలనీలో ఉంటున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications