యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం: ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్టు
బుల్లితెర నటి, యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గురువారం విష్ణుప్రియ తల్లి కన్నుమూశారు.
హైదరాబాద్: బుల్లితెర నటి, యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గురువారం విష్ణుప్రియ తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని విష్ణు ప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది. తన తల్లిని గుర్తు చేసుకుంటూ విష్ణుప్రియ భావోద్వేగానికి గురైంది.

మై డియర్ అమ్మా అంటూ కన్నీటిపర్యంతమైన విష్ణుప్రియ
'మై డియర్ అమ్మా.. ఈ రోజు వరకూ నాతో ఉన్నందుకు ధన్వవాదాలు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా చివరి శ్వాస వరకూ గుర్తు చేసుకుంటూనే ఉంటా. నువ్వే నా బలం. అలాగే బలహీనత కూడా. ఇకపై ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉంటావు. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలోనూ ఉంటావు. అలా, నేను బలాన్ని పొందుతాను. ఈ భూమ్మీద నాకంటూ ఓ మంచి జీవితం ఇవ్వడం కోసం నువ్వు చేసిన త్యాగాలన్నింటికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా' అంటూ విష్ణుప్రియ కన్నీటిపర్యంతమైంది.

నీ ముద్దులు లేవంటూ తల్లిపై విష్ణుప్రియ భావోద్వేగం
తన తల్లిని హత్తుకున్న మరో ఫొటోను షేర్ చేస్తూ.. 'ఇకపై నీ ముద్దులను మిస్ అవుతాను అమ్మా' అని విష్ణుప్రియ భావోద్వేగంగా పేర్కొంది. కాగా, ఈ వార్తను తెలుసుకున్న బుల్లితెర నటీనటులు, యాంకర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విష్ణుప్రియకు ధైర్యం చెబుతూ పలువురు బుల్లితెర నటులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
యూట్యూబర్ నుంచి పాపులర్ యాంకర్‌గా విష్ణుప్రియకు గుర్తింపు
విష్ణుప్రియ కెరీర్ విషయానికొస్తే.. ఒక యూట్యూబర్‌గా ప్రారంభించిన విష్ణుప్రియ.. ఈటీవీలో ప్రసారమైన 'పోవే పోరా'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు యాంకర్‌గా.. మరో వైపు బుల్లితెర నటిగానూ రాణిస్తున్నారు విష్ణుప్రియ. ఇటీవల విడుదలైన వాంటెట్ పండుగాడు సినిమాలోనూ విష్ణుప్రియ నటించారు. కాగా, ఇటీవల విష్ణుప్రియ స్నేహితురాలైన జబర్దస్త్ రీతూ చౌదరి తండ్రి మరణించారు. ఇప్పుడు విష్ణుప్రియ తల్లి మరణించడంతో ఇద్దరు స్నేహితులు విషాదంలో ఉన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications