షాకింగ్ : తెలుగు సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్...

దాదాపు 2 నెలల సంపూర్ణ లాక్ డౌన్‌తో నిలిచిపోయిన సినిమాలు,టీవీ సీరియళ్ల షూటింగ్‌కు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా మళ్లీ షూటింగ్స్ మొదలయ్యాయి. అయితే అలా మొదలయ్యాయో లేదో ఇండస్ట్రీని కరోనా వణికిస్తోంది.

ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే ఓ సీరియల్ నటుడికి తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మొదట ఆ నటుడికి జ్వరం,ఇతర లక్షణాలు కనిపించడంతో అనుమానంతో పరీక్షలు చేయించుకున్నాడు. టెస్టుల్లో అతనికి పాజిటివ్‌గా తేలడంతో అతనితో పాటు నటిస్తున్న ఇతర నటుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆ సీరియల్ షూటింగును నిలిపివేసి.. యూనిట్ సభ్యులందరినీ క్వారెంటైన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. అలాగే ఆ నటుడి కాంటాక్ట్స్‌ను కూడా అధికారులు గుర్తించే పనిలో పడ్డారు.

telugu tv serial actor tested coronavirus positive

లాక్ డౌన్ సడలింపుల తర్వాత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సినీ షూటింగులకు అనుమతి పొందారు. ఫిజికల్ డిస్టెన్స్,మాస్కులు,శానిటైజేషన్ వంటి నిబంధనలు పాటిస్తూ షూటింగులు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చింది. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ... కరోనా వ్యాప్తి మాత్రం ఆగట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+