వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు వికీపీడియన్ ప్రణయ్‌రాజ్ వంగరీ ప్రపంచ రికార్డు..

ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వికీపీడియన్ ప్రణయ్ రాజ్ కావడం విశేషం.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలానికి చెందిన తెలుగు వికీపీడియా రచయిత ప్రణయ్‌రాజ్ వంగరి వికీపీడియాలో రచనలో ప్రపంచ రికార్డు సాధించారు. నాలుగేళ్లుగా తెలుగు వికీపడియా వ్యాసాలు రాస్తున్న ప్రణయ్ వికీవత్సరం అనే కాన్సెప్టుతో 365రోజుల్లో 365వ్యాసాలు రాశారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వికీపీడియన్ ప్రణయ్ రాజ్ కావడం విశేషం. 2016సెప్టెంబర్ 7వ తేదీన వికీవత్సరం కాన్సెప్టుతో వ్యాసాలు రాయడం ప్రారంభించిన ప్రణయ్.. 2017 సెప్టెంబర్ 7 నాటికి 365వ్యాసాలను విజయవంతంగా రాయగలిగారు.

telugu wikipedian pranayraj vangari sets world record

ఈ అరుదైన ఘనత సాధించినందుకు వికీపీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అసఫ్ బార్టోవ్, ఇతర తెలుగు వికీపీడియన్లు ప్రణయ్‌ను ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా శాలువాతో ప్రణయ్ ను సత్కరించి, పూలమాలతో ఘనంగా సత్కరించారు.

సన్మానం పట్ల ప్రణయ్ రాజ్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు వికీపీడియన్ గా వికీవత్సరం పూర్తిచేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

English summary
Today, Pranayraj Vangari concluded a 365-day challenge where he created a new article on the Telugu Wikipedia every day for the past year, including on his wedding day and busy work days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X