Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేవాల‌యంకి వెళ్తే పెళ్లి వాళ్లే చేస్తార‌న్న ప్రేమికుల ధీమా..! ప్రేమాల‌యాలుగా మారుతున్న దేవాల‌యాలు..!

హైద‌రాబాద్ : ప్రేమికుల దినోత్స‌వం రోజున కొత్త ఎత్తులకు శ్రీ‌కారం చుడుతున్నారు ప్రేమికులు. ప్రేమికుల రోజున బ‌య‌ట క‌నిపిస్తే పెళ్లి చేస్తామ‌ని భ‌జ‌రంగ్ ద‌ల్, విశ్వ‌హిందూ ప‌రిష‌త్ నేత‌ల ప్ర‌క‌ట‌న‌ల‌కు కొంత మంది ప్రేమికులు భ‌య‌ప‌డుతుంటే, మ‌రికొంత మంది ప్రేమికులు ఆ ప్ర‌క‌ట‌న‌ల‌కు ఆక‌ర్శితులు అవుతున్నారు. ఎప్ప‌టినుంచో పెళ్లి కావాల్సిన వారు ప్రేమికుల రోజున ఏ పార్కుకో, లేదా ఏ గుడికో వ‌స్తే ఆటోమేటిక్ గా పెళ్లి జ‌రిగిపోంతుంద‌ని కొంత మంది ప్రేమికులు గాఢంగా న‌మ్ముతున్నారు, అందులో భాగంగా ప్ర‌త్యేకంగా ప్రేమికుల రోజున దేవాల‌యాల ద‌గ్గ‌ర భ‌క్తి పేరుతో త‌చ్చ‌ట్లాడుతుండం గ‌మ‌నార్హం..!

ప్రేమికుల రోజున పెళ్లి..! ఆస‌క్తి చూపుతున్న కొన్ని జంట‌లు..!!

ప్రేమికుల రోజున పెళ్లి..! ఆస‌క్తి చూపుతున్న కొన్ని జంట‌లు..!!

తాము మ‌న‌స్పూర్తిగా ప్రేమించిన వ్య‌క్తితో మూడు ముళ్లు వేయించికునే క్ష‌ణం కోసం చ‌కోర పక్షుల్లా ఎదురుచూస్తున్న ప్రేమ‌జంట‌ల‌కు ప్రేమికుల రోజు వ‌రంలా మారుతోంది. ప్రేమికుల రోజున రోడ్ల మీద స్వైర విహారం చేస్తే ఏదో ఒక స్వ‌చ్చంద సంస్థ‌కు చెందిన కార్య‌క‌ర్త‌లో, రాజ‌కీయ పార్టీ నేత‌లో ఏదో ఒక గుడిలోనో లేక ఆర్య‌స‌మాజ్ లోనో త‌మ పెళ్లి కాక పోతుందా అని భావిస్తున్న ప్రేమ‌జంట‌లు లేక‌పోలేదు. అందుకోసం పార్కులు సినిమా హాళ్లు కాకుండా దేవాల‌యాల మెట్ల‌ను న‌మ్ముకుంటున్నారు న‌యా జ‌మానా ప్రేమికులు. ప్రేమికుల రోజున ఉద‌యాన్నే భ‌క్తి పేరుతో గుళ్ల‌ల్లో ప్ర‌త్య‌క్ష‌మౌతున్నారు అమ‌ర ప్రేమికులు.

 కావాల‌ని పెళ్లి కోసం బ‌య‌ట‌కు వ‌చ్చే జంట‌లు కొన్ని..! వ‌చ్చి అడ్డంగా బుక్క‌య్యే జంట‌లు మ‌రి కొన్ని..!!

కావాల‌ని పెళ్లి కోసం బ‌య‌ట‌కు వ‌చ్చే జంట‌లు కొన్ని..! వ‌చ్చి అడ్డంగా బుక్క‌య్యే జంట‌లు మ‌రి కొన్ని..!!

ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ త‌ర‌హా ప్రేమికులు ఎక్కువైపోయార‌ని చెప్పొచ్చు. ప్ర‌త్యేకించి ప్రేమికుల రోజున ఏదైతే ఆంక్ష‌లు విధిస్తారో అదే ప్రాంతంలో ఏదో ప‌ని ఉన్న‌ట్టు అక్క‌డే గంట‌లు గంట‌లు గ‌డ‌ప‌డం అల‌వాటు చేసుకున్నారు ప్రేమికులు. గ‌తేడాది ఇలాగే వ్య‌వ‌హరించిన కొన్ని జంట‌ల‌కు స్వ‌చ్చంద సంస్థ‌ల కార్య‌క‌ర్త‌లు ద‌గ్ద‌గ‌రుండి క‌ళ్యాణం నిర్వ‌హించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆలాంటి సంఘ‌ట‌న‌ల‌ను ఆద‌ర్శంగా తీసుకున్న నేటి త‌రం ప్రేమికులు పెళ్లిల్ల కోసం ఇలాంటి ప్ర‌య‌త్నాలే చేస్తుండ‌టం విశ‌షం..!

కొన్ని దేవాల‌యాల్లో ప్రేమ వివాహాలు..! అన్నీ అర్చ‌కులే చూసుకుంటారు..!!

కొన్ని దేవాల‌యాల్లో ప్రేమ వివాహాలు..! అన్నీ అర్చ‌కులే చూసుకుంటారు..!!

ఇక కొన్ని దేవాల‌యాలు ప్రేమికుల‌కు వ‌రంగా ప‌రిణ‌మించాయి. న‌గ‌రంలో ఆర్య స‌మాజంలో పెళ్లిల్లు ఎలా నిర్వ‌హిస్తారో ఉమ్మ‌డి క‌రినంగ‌ర్ జిల్లా మంథ‌నిలో లక్ష్మీనారాయణ స్వామి ఆల‌యంలో ప్రేమికుల‌కు ఉత‌చింతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు అర్చ‌కులు. ప్రేమ వివాహాలతో పాటు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా చేస్తామ‌ని చెప్పుకొస్తున్నారు. ఇదే ఆలయంలో ఎనిమిదేళ్లలో 500కు పైగా ప్రేమ పెళ్లిళ్లు జరిపించిన‌ట్టుగా అర్చ‌కులు లెక్క‌లు చెప్తున్నారు.

దేవాల‌యాలే ప్రేమాల‌యాలు..! ట్రెండ్ మార్చిన ప్రేమికులు..!!

దేవాల‌యాలే ప్రేమాల‌యాలు..! ట్రెండ్ మార్చిన ప్రేమికులు..!!

ఇక పెళ్లి చేసుకోవాల‌నుకునే యువ‌తీ యువ‌కులు వారి వారి వయసు ధ్రువీకరణ సర్టిఫికెట్లను ఖ‌చ్చింతంగా త‌మ వెంట తెచ్చుకోవాల‌ని కొన్ని ప్రాంతాల్లో ప్రేమ వివాహాలు చేసే స్వ‌చ్చంద సంస్థ‌లు శ‌ర‌తులు విధిస్తున్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన త‌ర్వాతే మాంగ‌ళ్యం తంతునామే అనే మంత్రం వినిపిస్తుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా ఇలా ప్రేమికుల రోజున ఇంట్లో వాళ్ల‌ను కాద‌ని పెళ్లి చేసుకోబోయే ప్రేమికుల‌కు కౌన్సిలింగ్ ఇచ్చి వారి మాన‌సిక ప‌రిస్థితిని తెలుకునే ప్ర‌య‌త్నం కూడా కొన్ని సంస్థ‌లు చేప‌డుతున్నాయి. అంటే ప్రేమికుల రోజున ఇలా బ‌ల‌ట‌కు వెళ్లి అలా పెళ్లి చేసుకోవ‌చ్చ‌నే ప్రేమికుల‌కు పెళ్లి అనే తంతు అంత ఈజీ కాద‌నే అంశం కూడా నిర్ధార‌ణ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+