Nagarjuna Sagar: నాగార్జునసాగర్ వద్ద ఏం జరుగుతోంది..!
నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల పోలీసులను అక్కడ మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ముళ్లకంచెల మధ్య సాగర్ డ్యాంపై తెలుగు రాష్ట్రాల పోలీసుల పహారా కొనసాగుతోంది. నిన్న మధ్యా హ్నం ఏపీ అధికారులు కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారు. సాగర్ కుడి కాల్ప ద్వారా దాదాపు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీకి విడుదల చేశారు.
ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజీకి చేరే అవకాశముందిని అధికారులు చెబుతున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు ముందు బుధవారం అర్ధరాత్రి నాగార్జునసాగర్ వద్ద ఏపీ పోలీసులు వచ్చారు.

అక్కడ ఏపీ పోలీసులు బారికేడ్లు పక్కకు తోసి 13వ గేట్ వద్దకు వచ్చారు. నీటిని విడుదల చేసుకున్నారు. 2015 ఫిబ్రవరి 13న నాగార్జున సాగర్ పై ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఇలాంటి గొడవే జరిగిన సంగతి తెలిసిందే. రెండు ప్రభుత్వాలు పంతానికి పోవడంతో నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నారు. ఏపీ అధికారులు కుడిగట్టు క్రస్ట్‌గేట్ల స్విచ్‌రూమ్ తలుపులు పగలగొట్టారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
"ప్రశాంతంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ అలజడి మొదలైంది. అన్నదమ్ముల్ల కలిసిపోయిన తెలంగాణ, ఆంధ్రవారిలో మళ్లీ విభేదాలకు తెరలేపేందుకు కుట్రలు జరుగుతోందని" మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications