హైదరాబాద్‌లో ఉగ్రవాది గులాం జాఫర్ అరెస్ట్: అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో నిందితుడు
హైదరాబాద్: నగరంలో బుధవారం ఉదయం ఉగ్రవాది గులాం జాఫర్ షేక్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2003లో గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జరిగిన పలు బాంబు పేలుళ్ల కేసులో గులాం జాఫర్ నిందితుడుగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
జైష్ఏ అహ్మద్, ఐఎస్ఐఎస్, లష్కరే తొయిబాల వంటి ఉగ్రవాద సంస్థలతో నిందితుడికి సంబంధాలున్నాయని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ పేలుళ్ల ఘటన జరిగిన తర్వాత అక్కడ్నుంచి కుటుంబంతో సహా నగరంలోని హకీంపేటకు వచ్చాడు జాఫర్. ఇక్కడే టైలర్ పని చేసుకుంటూ తలదాచుకుంటున్నాడు.
కాగా, అహ్మదాబాద్ పేలుళ్లలో ఉగ్రవాదులకు తుపాకులు, పేలుడు పదార్థాలను జాఫర్ అందించాడు. పేలుళ్లకు పాల్పడిన అనంతరం 12ఏళ్ల క్రితం ఉగ్రవాది జాఫర్ హైదరాబాద్ వచ్చాడు. హకీంపేటలోని ఐఏఎస్ కాలనీలో తన కుటుంబంతో నివాసముంటున్నాడు. అహ్మద్ అనే మరో ఉగ్రవాది ఇచ్చిన సమాచారం మేరకు గుజరాత్ పోలీసులు జాఫర్‌ను మూడు రోజుల క్రితం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మారువేషాల్లో వచ్చిన గుజరాత్ పోలీసులు, పక్కా ప్రణాళికతో జాఫర్‌ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. సెక్షన్82 ద్వారా అరెస్ట్ చేసినట్లు గుజరాత్ ఏటిఎస్ పోలీసులు తెలిపారు.
కాగా, బిజెపి అరుణ్ పాండ్యన్ హత్య కేసులో కూడా నిందితుడు జాఫర్ నిందితుడిగా ఉన్నాడు. అంతేగాక, జాఫర్.. బిజెపి, విహెచ్‌పి నేతల హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. అయితే, ఉగ్రవాదికి సంబంధించిన ఇల్లు, టైలర్ షాపునకు సంబంధించిన వివరాలు రహస్యంగా ఉంచారు పోలీసులు.

కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
హయత్‌నగర్ కిడ్నాప్ కేసును నగర పోలీసులు మంగళవారం ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు కిడ్నాపర్లు మహేశ్, రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడు నవీన్ ను కిడ్నాప్ చేసేందుకు మహేశ్ రూ. లక్ష సుపారీ ఇచ్చాడని పోలీసులు చెప్పారు.
మహేశ్‌కు ఆడపిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నవీన్ కిడ్నాప్ కు యత్నించారని పోలీసులు వెల్లడించారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కేసులో మరో ఇద్దరు కిడ్నాపర్లు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications