మరో ఎన్నికల సమరం, ముహూర్తం ఫిక్స్ - గెలుపెవరిది..!!

తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్దం అవుతోంది. సుదీర్ఘ కసరత్తు తరువాత దసరా లోగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవోతోనే వెళ్లేందుకు సిద్ధమైంది.ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. రెండు రోజుల్లోగా వాటిని ఖరారు చేసి పంపాలని జిల్లాల కలెక్టర్లకు సర్కారు ఆదేశాలిచ్చింది. దీంతో, వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతోంది. బీసీల రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో.. పెంచిన రిజర్వేషన్లను అమలుచేసేందుకు వీలుగా పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285(ఏ)లో చేసిన సవరణలతో జీవో జారీ చేసేందుకు సర్కారు సిద్ధమైనట్టు సమాచారం. విజయ దశమిలోగా షెడ్యూలు విడుదలకు వీలుగా.. వార్డులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్‌ల ఎన్నికకు అవసరమైన రిజర్వేషన్‌ ప్రక్రియను పూర్తిచేయాలని, రెండు రోజుల్లోగా వాటిని ఖరారు చేసి పంపాలని జిల్లాల కలెక్టర్లకు సర్కారు ఆదేశాలిచ్చింది. కాగా రిజర్వేషన్‌ల ఖరారుకు అవసరమైన సమాచారం మొత్తాన్నీ ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు అందించింది.

tg-govt-planning-for-local-body-elections-in-next-month-special-orders-for-bc-reservations

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 2024లో నిర్వహించిన కులగణన వివరాల ప్రకారం ఖరారు చేయాలని కలెక్టర్లకు సూచించింది. ఆ వివరాలన్నింటినీ కలెక్టర్లు సోమవారం నిర్వహించే సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు అందించి రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గ్రామాలను మున్పిపాలిటీల్లో విలీనం చేసింది .తాజా వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామపంచాయతీలు, 565 మండలాలు, 31 జిల్లాలు ఉన్నాయి. 1,12,534 మంది వార్డు సభ్యులు ఉండగా.. 5,763 ఎంపీటీసీలు, 565 మండల ప్రజా పరిషత్‌లు, 31 జిల్లా ప్రజాపరిషత్‌లు ఉన్నాయి. వీటి ప్రకారం రిజర్వేషన్‌లను ఖరారు చేయనున్నారు. ఖరారు చేసిన రిజర్వేషన్ల స్థానాల వివరాలన్నింటినీ సీల్డ్‌ కవర్‌లో ఉంచి, నివేదికలను మంగళవారం సాయంత్రానికల్లా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు.

ఇటు అధికార పార్టీ ఎన్నికలకు ఇది సరైన సమయంగా భావిస్తోంది. రిజర్వేషన్లతో పాటుగా పథకాల అమలు తమకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికలకు సిద్దం కావాల్సి ఉందని.. పూర్తిగా తమకు అనుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా.. ఇదే సమయంలో ప్రభుత్వం పైన క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యతిరేక పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. ఈ ఎన్నికల సమరం లో ఏ పార్టీ పై చేయి సాధిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+