తెలంగాణకు కొత్త డీజీపీ - రేవంత్ ఛాయిస్..!!
తెలంగాణకు కాబోయే డీజీపీ ఎవరు. ముఖ్యమంత్రి రేవంత్ ఛాయిస్ ఎవరున్నారు. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారుల్లో సాగుతున్న చర్చ ఇది. సీనియార్టీతో పాటుగా ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిగా మారుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపిక కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన ఐపీఎస్ అధికారులను గుర్తించి వారి పేర్లను యూ నియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ)కి పంపనుంది. అయిదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులు రేసులో ఉన్నారు. ఇందులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నాయి.
కొత్త డీజీపీగా
తెలంగాణ ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేస్తారు. దానికి మూడు నెలల ముందు కొత్త డీజీపీ అర్హుల జాబితాను యూపీఎస్సీకి ప్రభుత్వం పంపాల్సి ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కొత్త డీజీపీ ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. సద రు మార్గదర్శకాల ప్రకారం.. పూర్తిస్థాయి డీజీపీ పదవికి కనీసం 30 ఏళ్ల సర్వీసు, డీజీపీ హోదా లో పనిచేసిన అనుభవం వంటి అర్హత లుం డాలి. రాష్ట్రంలో ప్రస్తుతం డీజీపీ హోదాలో దాదాపు ఏడుగురు అధికారులుఉన్నారు. పదవీ విరమణకు 6 నెలల సర్వీసు ఉన్న అధికారుల పేర్లు కూడా పంపొచ్చు. డీజీపీగా నియమితులైతే రెండేళ్లు ఆ పదవిలో ఉంటారు. రెండేళ్లకన్నా తక్కువ పదవీకాలం ఉంటే వారికి ఆ మేరకు ఎక్స్‌టెన్షన్ ఇస్తారు.

జాబితాలో ఉన్నదెవరు
కొత్త డీజీపీగా సీనియార్టీ జాబితాలో ప్రస్తుత హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా 1990 బ్యాచ్ అధికారి. ఆయన వచ్చే డిసెంబర్‌లో రిటైరవుతారు. ఆ తర్వాత 1991 బ్యాచ్ అధికారి, అదే విధంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు 2028 జూన్ వరకు సర్వీసు ఉంది. తర్వాత స్థానంలో 1994 బ్యాచ్ అధికారి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డికి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు సర్వీసు ఉంది. ఆ తర్వాత స్థానంలో 1994 బ్యాచ్ అధికారి, జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రాకు 2027 డిసెంబర్ వరకు, 1994 బ్యాచ్ అధికారి, సీఐడీ డీజీ షికా గోయల్‌కు 2029 మార్చి వరకు సర్వీసు ఉంది. వీరి పేర్లను, సర్వీసు రికార్డును యూపీఎస్సీకి ప్రభుత్వం పంపుతుంది. వారిలోంచి ముగ్గుర్ని యూపీఎస్సీ ఎంపానల్ కమిటీ ఎంపిక చేసి.. ఆ లిస్టును తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది.
రేవంత్ ఛాయిస్
కాగా, ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుత డీజీపీ జితేందర్‌ను కూడా యూపీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేయలేదు. సీనియారిటీ ప్రకారం రవిగుప్తా, ఆనంద్, శివధర్‌రెడ్డిల పేర్లతో యూపీఎస్సీ నుంచి ఫైనల్ లిస్టు వెనక్కి రావచ్చని పోలీసుశాఖలో ఊహగానాలు సాగుతున్నాయి. అయితే, సాధారణంగా ప్రభుత్వం డీజీపీ విషయం లో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటుంది. వివాదాలకు అవకాశం లేకుండా.. సమర్ధవంతులకే డీజీపీగా అవకాశం దక్కుతుందని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. కాగా, డీజీపీ ఎంపిక లో చివరకు ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే నియామకం జరగనుంది. దీంతో.. రేవంత్ చివరకు ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications