నేడే TG TET పరీక్షా ఫలితాలు వెల్లడి: మధ్యాహ్నం నుంచి డౌన్ లోడ్
తెలంగాణ నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న టెట్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఫలితాలను వెల్లడి కానున్నాయి. ఫలితాల ప్రకటన అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ మార్కుల వివరాలను సులభంగా తెలుసుకోవడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఫలితాల లింక్‌ను వెబ్‌సైట్‌లో లైవ్ చేయనున్నారు. దీని ద్వారా అభ్యర్థులు తమ సర్టిఫికేట్ చెకింగ్ పూర్తి చేసుకోవచ్చు.
ఈ ఏడాది టీజీ టెట్ పరీక్షలు కిందటి నెల 16 నుంచి 22 వరకు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించడానికి అర్హత కల్పించే పేపర్-1 పరీక్షకు 50,113 మంది హాజరయ్యారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించడానికి సంబంధించిన పేపర్-2ను అత్యధికంగా 1,03,639 మంది రాశారు.

ఈ సంవత్సరం టీజీ టెట్ అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగడానికి గత కొద్దికాలంగా తెలంగాణ విద్యాశాఖలో శరవేగంగా సాగుతున్న ఉపాధ్యాయ నియామక ప్రక్రియే ప్రధాన కారణం. డీఎస్సీ పరీక్షలో టెట్ మార్కులకు ఏకంగా 20 శాతం వెయిటేజీ ఇస్తారు. ఇందువల్ల ఈ అర్హత పరీక్షలో వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించడం ప్రతి ఒక్క అభ్యర్థికి అవసరంగా మారింది.
ఫలితాలను విడుదల చేసిన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgtet.aptonline.in పరిధిలోకి లాగిన్ కావాలి. వెబ్‌సైట్ ప్రధాన పేజీలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంచే టీజీ టెట్ జూన్ 2026 ఫలితాలు అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. స్క్రీన్‌పై కనిపించే ఫలితాల కాపీ లేదా స్కోర్ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు.
పరీక్ష ఫలితాలు వెలువడే సమయంలో ఒకేసారి వేలాది మంది వెబ్‌సైట్‌ను సందర్శించడంతో సాంకేతిక ఇబ్బందులు లేదా సర్వర్ డౌన్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని, కొంత సమయం వేచి చూసి నిదానంగా ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ లింకులు, అనధికారిక వెబ్‌సైట్ల ద్వారా వచ్చే ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని సూచించారు.












Click it and Unblock the Notifications