వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీలో కీలక మార్పులు..!!
వాహన దారులకు గుడ్ న్యూస్. ఇక వాహన రిజిస్ట్రేషన్లు.. లైసెన్సుల కోసం రవాణా శాఖ ఆఫీసుల కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే వీటిని పొందేలా కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పోర్టల్స్ వాహన్ - సారధితో తెలంగాణ ప్రభుత్వం అనుసంధానం అయింది. దీని ద్వారా ఇక మార్చి తొలి వారం నుంచి ఆన్‌లైన్‌లో వాహనాలకు రిజిస్ట్రేషన్లతో పాటుగా లైసెన్సుల జారీ ప్రక్రియ అమల్లోకి రానుంది. ముందుగా స్లాట్ లు బుక్ చేసుకోవటం.. వేచి చూడటం వంటి వాటి నుంచి వాహన దారులకు రిలీఫ్ దక్కనుంది.
హైదరాబాద్ కేంద్రంగా ఈ తరహా సేవలు ముందుగా అందుబాటులోకి రానున్నాయి. విడతల వారీ గా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. తొలి విడతలో సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో ఈ సేవలను అందించనున్నారు. క్రమేణా దశల వారీగా అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ ఆఫీసు ల్లో సేవలు అందించేందుకు రవాణా శాఖ ఉన్నతాధికారులు కసర్తతు చేస్తున్నారు. 2016 లో కేంద్ర రవణా శాఖ దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కాకుండా దేశంలోని అన్ని వాహనాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకేచోట ఉంచేందుకు వీలుగా ఈ పోర్టల్‌ను రూపొందించింది. రాష్ట్రాల వారీగా అనుసంధానం చేసి ఆన్‌లైన్ విధానం లో సేవలు అందిస్తున్నారు.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 'వాహన్' పోర్టల్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రాంతాలకు వాహనాల బదిలీ, యజమానుల పేరు మార్పు వంటివి ఆన్‌లైన్‌లోనే చేసుకొనేలా వెసులుబాటు కలగనుంది. కొత్తగా వాహనం కొనుగోలు చేస్తే, సంబంధిత షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకో వచ్చు. 'సారధి' పోర్టల్‌తో డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా అందుబాటులోకి తెచ్చారు.
గడువు ముగిసిన లైసెన్స్‌ను ఆన్‌లైన్‌లోనే రెన్యూవల్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దీంతో, లైసెన్సు ల కోసం దూర ప్రాంతాల్లో ఉన్న రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు తాజా నిర్ణయం తీ ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఈ తరహా సేవలు అందుబాటులోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications