నిరుద్యోగులకు టీజీఎస్ ఆర్టీసీ తీపికబురు..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలోని ఉద్యోగం లేని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 800 కండక్టర్ల పోస్టులను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ పోస్టులకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. తాత్కాలిక నియామకాలుగా చేపట్టిన ఈ ప్రక్రియ ద్వారా, నిరుద్యోగులకు తక్షణ ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

tgs-rtc-good-news-for-unemployed-about-800-jobs

మొత్తం ఖాళీలు..

800 ( హైదరాబాద్ రీజియన్‌ - 600 పోస్టులు, వరంగల్ రీజియన్‌ - 200 పోస్టులు )

అర్హత..

పదో తరగతి (10వ తరగతి) పాస్ అయి ఉండాలి

జీతం..

నెలకు రూ. 17,969 ( ఓవర్ టైం ఉంటే గంటకు రూ. 100 చొప్పున అదనపు పారితోషికం ఇస్తారు )

డ్యూటీ టైం: రోజుకు 8 గంటలు

ఎంపిక విధానం..

ఉద్యోగాల ఎంపిక ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జరగనుంది.

దరఖాస్తు ప్రక్రియ..

దరఖాస్తు ప్రక్రియ ఆర్టీసీ డిపోల ద్వారా లేదా ఆన్‌లైన్‌లో చేపట్టే అవకాశం ఉంది.

పూర్తి అర్హతలు, వయోపరిమితి, ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు. కావున, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం మంచిది. సంబంధిత అప్డేట్స్ కోసం టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలిస్తూ ఉండాలి. ఇది తాత్కాలిక నియామకం అయినప్పటికీ, పని నైపుణ్యం ఆధారంగా భవిష్యత్తులో రెగ్యులర్ ఉద్యోగావకాశాలు కూడా ఉండొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ ప్రాంతాల్లోని నిరుద్యోగులకిది మంచి అవకాశం అని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+