ఈ స్వీట్ ను తినేముందు.. ఒక్కసారి ఎలా తయారు చేస్తున్నారో చూడండి..!

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసుకునే సమయం లేక.. సమయం ఉన్నా వంట చేసుకునే ఓపిక లేక చాలామంది హోటళ్లనే ఆశ్రయిస్తున్నారు. డబ్బులు ఎక్కువైనా సరే నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసి లాగించేస్తున్నారు. అది కాస్త కంటికి ఇంపుగా, నాలుకకు రుచిగా అనిపిస్తే చాలు వెనుకాముందూ ఆలోచించకుండా తినేస్తున్నారు. మరి హోటళ్లతో మనం తినే ఆహారం సురక్షితమేనా..? ఆరోగ్యానికి భరోసా ఉంటుందా..? అనే ప్రశ్నలను మర్చిపోతున్నారు.

ఈ క్రమంలోనే కస్టమర్ల తాకిడిని బట్టి హోటల్, రెస్టారెంట్ యజమానులు విచ్చలవిడిగా రెచ్చిపోయి కల్తీ దందాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకీ తీవ్రతరం అవుతున్న ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్‌ ఎసెన్సియల్ డ్రగ్స్‌(TG SAFE) ను ఏర్పాటు చేసింది.

అయితే ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో నగరవాసుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అలాగే ఎన్ ‌ఫోర్స్‌ మెంట్ అధికారులు సంయుక్తంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు CURE జోన్ పరిధిలో ఉన్న 12 పేణీల తయారీ స్థావరాలపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. గౌలిపురా, మలక్‌ పేట, జియాగూడ, బాదంగ్‌ పేట ప్రాంతాల్లో గురువారం నిర్వ‌హించిన త‌నిఖీల్లో ప‌లు లోపాలు వెలుగులోకి వ‌చ్చాయి.

TGSAFE maintains special surveillance on illicit activities during the festive season inspections

ఈ పేణీల తయారీ కేంద్రాల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు కార్మికులు క్యాపులు, గ్లౌజులు లేకుండానే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు తేల్చారు. మరికొన్ని చోట్ల అయితే మరీ దారుణంగా మురికి దుస్తులతో, ఒంటి నిండా చెమటతోనే ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముడి పదార్థాలు, తయారైన పేణీని నేలపైనే ఉంచినట్లు తనిఖీల్లో స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కల్తీ.. అపరిశుభ్రంగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని TG SAFE అధికారులు స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేసి భారీ జరిమానాలు విధిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+