ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త, భారీ ప్రయోజనం..!!

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయం లో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఉద్యోగులకు రూ 10 లక్షల జీవిత భీమా సదుపాయం కల్పిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. దీని ద్వారా ఉద్యోగులకు ప్రయోజనం దక్కనుంది.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఈ క్యాలెండర్ సంవత్సరం (2026) నుండి 2.1% DA పెంపు పైన ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇంతకు ముందు 50.7% DA ఉండగా, ఇపుడు దాన్ని 52.8% కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన DA జనవరి 1, 2026 నుండి అమలు కానుంది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని అధికారులు వెల్లడించారు. చివరగా జూలై 2025 లో కూడా 2.1% DA పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జూలై 2025 లో 48.6% నుండి 50.7% నికి పెంచుతూ నిర్ణయించింది. ప్రస్తుతం పెరిగిన 2.1 శాతం డీఏ తో 52.8 % కి చేరింది. మే 2024 లో RPS - 2017 అమలు తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

tgsrtc-announce-da-hike-for-employees-decided-to-introduce-insurance-scheme-here-the-details

ఉద్యోగులకు రూ 10 లక్షల జీవిత భీమా

ఆర్టీసీ లో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ లో ఆర్ ఎం లతో సమావేశాన్ని నిర్వహించి పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది... దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరింది. జనవరి నుండి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ లు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుందని స్పష్టం చేసారు. కాగా.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. ఇప్పటివరకు తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్న సిబ్బందికి కేవలం ప్రమాదవశాత్తు మరణిస్తేనే బీమా వర్తించేది, కానీ ఇకపై సహజ మరణానికి కూడా రూ. 10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 38 వేల మందికి పైగా ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రత లభించనుంది. ఈ బీమా సౌకర్యం 2026, ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+