ప్రయాణీకులకు TGSRTC తీపి కబురు, ఈ బస్సుల్లో ఛార్జీల తగ్గింపు..!!
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు తీపి కబురు అందించింది. హైదరాబాద్ లో ప్రయాణించే బస్సు ల ఛార్జీలను తగ్గించింది. నిర్దేశించిన కేటగిరీల్లో టికెట్ ధరలను తగ్గిస్తూ అన్ని డిపోలకు ఆర్టీసీ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. నగరంలో ప్రయాణీకుల ఆక్యుపెన్సీ రేషియో పెంచుకునే క్రమంలో భాగంగా ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ బస్సులో ఎంత మేర రిబేటు ఇస్తుందీ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
వేసవిలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో నడిచే మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ బస్సుల టికెట్ ధరలను తగ్గిస్తూ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీ బస్సులను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గరంలో ప్రస్తుతం 275 మెట్రో డీలక్స్ బస్సులు 255 ట్రిప్పులు, 90 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు 731 ట్రిప్పులు తిరుగుతున్నాయి. వీటిలో 60 శాతానిపైగా ఆక్యుపెన్సీనే లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ధరలను సవరించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ప్రయాణీకులకు వెసులుబాటు
మెట్రో డీలక్స్ బస్సులో గతంలో నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి రూ.30 టికెట్ ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.25కు తగ్గించారు. ఇక ఈ-మెట్రో ఏసీ సర్వీసులో గతంలో రూ.35 ఉండగా ఇప్పుడు రూ.25కి తగ్గించారు. గ్రేటర్ హైదరాబాద్లో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. నగరంలో ప్రజా రవాణాను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే రోజుల్లో విద్యుత్ రవాణా వ్యవస్థ దిశగా మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సంస్థ 1085 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications