అరుణాచలం, శబరిమల, పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు- షెడ్యూల్, ప్యాకేజీ ఇలా..!!

ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కార్తీక మాసం వేళ భక్తులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శివాలయాలకు వెళ్లాలనుకునే వారి కోసం సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు. వీరితో పాటుగా శబరిమల భక్తులు.. ఇక, ప్రముఖ శైవ క్షేత్రాలైన పంచారామాలకు ప్రత్యేక బస్సుల తో పాటుగా ప్యాకేజీలను ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

కార్తీక మాసం వేళ ప్రయాణీకుల సౌకర్యార్ధం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా తమిళనాడులోని అరుణాచలం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పంచారామాలు, కేరళలోని శబరిమల ఆలయాలకు బస్సులు నడపనుంది. ఈ మేరకు 30 మంది భక్తులు కలిసి ఏదైనా పుణ్యక్షేత్రం సందర్శనకు బస్సు కావాలనుకున్నా కూడా ఆర్టీసీ సమకూర్చనుంది. కాగా, అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ఈ నెల (నవంబర్) 23న హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు కదలనుంది. దారి మధ్యలో కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్‌ వద్ద బస్సు ఆగుతుంది. దీంతో ఈ ఆలయాలనూ సందర్శించొచ్చు. అరుణాచలం నుంచి తిరుగు ప్రయాణంలో గద్వాల్‌లోని జోగులాంబ ఆలయాన్ని దర్శించుకునేలా ఆర్టీసీ అధికారులు యాత్రను రూపొందించారు. టికెట్‌ ధర పెద్దలకు రూ.5 వేలు, పిల్లలకు రూ.3,500గా నిర్ణయించారు.

కార్తీక మాసం శ్రవణా నక్షత్ర వేళ, 9 టన్నుల పుష్పాలతో- తిరుమలలో కన్నుల పండువగా..!!
కార్తీక మాసం శ్రవణా నక్షత్ర వేళ, 9 టన్నుల పుష్పాలతో- తిరుమలలో కన్నుల పండువగా..!!
tgsrtc-announces-special-buses-and-pilgrimage-packages-to-arunachalam-sabarimala-and-pancharamas

ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలు

ఇక, కేరళంలోని శబరిమలకు వెళ్లే అయ్యప్ప మాలధారణలో ఉన్న భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను తీసుకొచ్చింది. 36 మంది స్వాములు కలిసి బస్ బుక్ చేసుకుంటే.. అధికారులు ఒక బస్‌ను కేటాయిస్తారు. ఈ సర్వీసులో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక వంటమనిషికి ఉచిత ప్రయాణం కల్పిస్తారు. ఆంధ్రాలో పంచారామ క్షేత్రాలుగా ప్రఖ్యాతి పొందిన అమరలింగేశ్వరుడు (అమరావతి), సోమేశ్వరస్వామి (భీమవరం), క్షీర గేశ్వరస్వామి (పాలకొల్లు), భీమలింగేశ్వరస్వామి (సామర్లకోట), భీమేశ్వరస్వామి (ద్రాక్షారామం) ఆలయాలను సందర్శన కోసం ప్రతి ఆదివారం హనుమకొండ నుంచి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. పంచారామ క్షేత్రాలను ఒకే రోజు సందర్శించేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర టికెట్ ధర పెద్దలకు రూ.2,300గా, చిన్నారులకు రూ.1,500గా నిర్ణయించింది. మరిన్ని వివరాల కోసం 96521 24049 నంబరును సంప్రదించాలని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+