ఏపీ ప్రజలకు టీజీఆర్టీసీ గుడ్‌న్యూస్: హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ గరుడ బస్సులు

ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు కొత్తగా రెండు ఈ- గరుడ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు.

సెప్టెంబర్ 30న ఈ- గరుడ బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. రామచంద్రపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ రైతు బజార్, మలేషియా టౌన్ షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్, మైహోం భుజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాంనగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడకు ఈ బస్సులు ప్రయాణిస్తాయని మేనేజర్ తెలిపారు.

TGSRTC good news for AP people E-Garuda buses from Hyderabad to Vijayawada

దీంతో ప్రయాణికులకు ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి విముక్తి కలుగుతుందని తెలిపారు. ప్రతిరోజూ రాత్రి 9.30, 10.30 గంటలకు రామచంద్రాపురం నుంచి బస్సులు బయలుదేరుతాయన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ శ్రీలత కోరారు. ఈ రెండు బస్సులకు సంబంధించి టీజీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుకింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు

కాగా, విజయవాడకు ఇప్పటికే బీహెచ్ఈఎల్ వైపు నుంచి పలు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే, వీటిలో చాలా వరకూ కూకట్‌పల్లి, అమీర్‌పేట్ మీదుగా వెళుతుంటాయి. ఏపీ వైపు వెళ్లు బస్సులు ఎక్కువగా ఇదే రూట్‌లో వెళుతుంటాయి. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులు, కార్లు ఇతర వాహనాలతో ఈ రూట్ సాయంత్రం నుంచి బీజీగా మారుతుంది.

ట్రాఫిక్ జాంలో ఇరుక్కుంటే గంటలతరబడి నిలిచిపోవాల్సి వస్తుంది. అందుకే, ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు తాజాగా, అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ గరుడ బస్సులను ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణించనున్నాయి.మరోవైపు, దసరా పండగ సందర్భంగా పెద్ద సంఖ్యలో బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+