TGSRTC గుడ్ న్యూస్ - రూ 600 లకే వారం రోజులు అన్ లిమిడెడ్ జర్నీ..!!
TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణీకులకు అతి తక్కువ ధరలకే వారం రోజుల పాటు అన్ లిమిటెడ్ జర్నీకి అవకాశం కల్పించింది. ఇందు కోసం రూ 600 లకే పాస్ అందుబాటులోకి తెచ్చింది. క్యూర్ పరిధితో పాటుగా ఏసీ బస్సుల్లోనూ ఈ పాస్ వర్తించేలా నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల సిటీ బస్సుల్లోనూ ఈ పాస్తో అపరిమితంగా ప్రయాణించేలా అమలు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు బిగ్ ఆఫర్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్సు ప్రయాణీకులకు టీజీఎస్ ఆర్టీసీ కొత్త పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. రాజధాని ప్రాంతం లో ప్రయాణం మరింత సులభతరం .. బడ్జెట్ తక్కువతో కొత్త ఆఫర్ ప్రకటించింది. ప్రయాణీకుల సౌకర్యార్ధం రూ 600 లకే అన్ లిమిటెడ్ వీక్లీ బస్సు పాస్ ప్రవేశ పెట్టింది. ఏడు రోజుల పాటు అన్ లిమిలెడ్ ప్రయాణం కల్పించింది. ఈ బస్ పాస్ కొనుగోలు చేసిన రోజు నుంచి వరుసగా ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. గ్రేటర్ పరిధిలోని ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సుల్లోనూ ప్రయాణీకులు ఈ పాస్ తో అపరిమితంగా ప్రయాణం చేయవచ్చు. కేవలం పుష్పక్ ఏయిర్ పోర్టు లైనర్ సర్వీసులకు మాత్రం ఈ పాస్ వర్తించదని అధికారులు వెల్లడించారు.

వారం రోజు పాటు అపరిమిత జర్నీ
కాగా, ప్రస్తుతం ప్రయాణీకులకు అందుబాటులో ఉన్న రోజువారీ, నెలలవారీ పాస్ లకు అదనం గా ప్రయాణీకులకు అనుకూలత కోసం ఈ పాస్ అందుబాటులోకి తెచ్చింది. వ్యాపార పనులు.. నగరానికి వచ్చే సందర్శకులకు ఈ పాస్ ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. వీరు ఈ పాస్ ద్వారా వారం రోజుల పాటు ప్రయాణించే వారికి లాభదాయమని వివరిస్తున్నారు. బస్సు పాస్ వీక్లీ బస్సు పాస్ లు నగరంలో అన్ని సిటీ బస్ పాస్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. అవసరమైన వారు తమ సమీపంలోని బస్సు పాస్ కౌంటర్లకు వెళ్లి పాస్ లు కొనుగోలు చేయవచ్చని యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ రవాణ మరింతగా వెసులుబాటుగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.













Click it and Unblock the Notifications
