హైదరాబాద్ లో ఇక రాత్రంతా బస్సు సర్వీసులు - టైమింగ్స్, మార్గాలు..!!

TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల సౌకర్యార్ధం రాత్రంతా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు రూట్లతో పాటుగా బస్సు టైమింగ్స్ వెల్లడించింది. రాత్రి వేళ అవసరం ఉన్న మార్గాలను ఆర్టీసీ గుర్తించింది. దీని ద్వారా రాత్రి, తెల్లవారుజామున వివిధ మార్గాల్లో ప్రయాణికుల రద్దీని అధ్యయనం చేసిన తర్వాత దశల వారీగా నగరం మొత్తం ఈ విధానం అమలు చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.

తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నగరంలో రాత్రి మొత్తం బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు రూట్లను ఎంపిక చేసింది. ఆరు ఎంపిక చేసిన మార్గాల్లో ఎనిమిది బస్సులు నడిపే విధంగా ప్రణాళిక ఖరారు చేసారు. అందులో రూట్ 10H (సికింద్రాబాద్-హైటెక్ సిటీ-కొండాపూర్): మార్గం లో ఐటీ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు అధికంగా ఉన్న ఈ మార్గంలో రోజంతా ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఈ రూట్ లో రాత్రి సమయంలో 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. రూట్ 290U (సికింద్రాబాద్-హయత్‌నగర్)ఈ రూట్ కూడా రాత్రి బస్సు నెట్‌ వర్క్‌లో కీలకంగా ఉండనుంది. ముఖ్యంగా ఎల్‌బీనగర్, వనస్థలిపురం, ఎన్జీవోస్ కాలనీ వైపు రాత్రిపూట ప్రయాణించే వారికి ఇది ప్రయోజనకరంగా మారనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్ నుంచి బస్సును ప్రారంభించనున్నారు.

 సంచలన సర్వే: తెలంగాణలో ఆ పార్టీ సీన్ రివర్స్, ఇక వారిదే హవా- ఎవరికి ఎన్ని సీట్లు..!!
సంచలన సర్వే: తెలంగాణలో ఆ పార్టీ సీన్ రివర్స్, ఇక వారిదే హవా- ఎవరికి ఎన్ని సీట్లు..!!
tgsrtc-introduces-dedicated-night-bus-services-on-six-major-routes-operating-broadly-between-10-pm

రాత్రి వేళ సర్వీసులతో ప్రయోజనం

అదే విధంగా కోటి-పటాన్‌చెరు రూట్ లో రాత్రివేళ ఈ మార్గంలో సుమారు గంటకోసారి బస్సు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రూట్ 222A (కోటి-పటాన్‌చెరు, హైటెక్ సిటీ మీదుగా): ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ఈ మార్గంలో కూడా 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో రాత్రి బస్సులను నడపనున్నారు. రూట్ 219 (సికింద్రాబాద్-పటాన్‌చెరు): ఈ మార్గాన్ని కూడా తొలి దశలోని ఆరు కీలక రాత్రి బస్సు రూట్లలో చేర్చారు. రూట్ 195W (బాచుపల్లి, పరిసర ప్రాంతాలు): రాత్రిపూట పనిచేసే ఐటీ ఉద్యోగులతో పాటు వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ సర్వీసు ఉపయోగపడనుంది. హైదరాబాద్‌లో రాత్రి వేళ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో TGSRTC తీసుకున్న ఈ నిర్ణయానికి వచ్చే స్పందన కు అనుగుణంగా రానున్న రోజుల్లో రాత్రి వేళ సర్వీసుల పరిధి పెంపు పైన నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+