ఆ ప్రధాన సమస్యకు బిగ్ చెక్ పెట్టిన TGSRTC
TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- బెంగళూరు వంటి రద్దీ మార్గాల్లో ప్రయాణ ఛార్జీలో 10 శాతం డిస్కౌంట్‌ను ప్రకటిస్తూ వస్తోంది.
ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని భారీగా పెంచుతోంది. హైదరాబాద్ సిటీ సహా పలుమార్గాల్లో అత్యాధునిక ఈవీ బస్సులు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం 80 శాతం సగటు ఆక్యుపెన్సీతో 254 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తోన్నాయి. ఈ ఏడాది మరో 1,000 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకుని రావాలని భావిస్తోంది.

పెరుగుతున్న ఈవీ బస్సులకు అనుగుణంగా ఛార్జింగ్ పాయింట్లను కూడా నెలకొల్పడానికి టీజీఎస్ఆర్టీసీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను సొంతంగా నెలకొల్పనుంది. దీనికి అవసరమైన లొకేషన్లను సైతం గుర్తించింది.
ఆయా ప్రాంతాల్లో వీటిని నెలకొల్పడానికి ఆపరేటర్ల నుంచి బిడ్డింగులను ఆహ్వానిస్తోంది టీజీఎస్ఆర్టీసీ. తొలిదశలో మొత్తం 31 చోట్ల ఈ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు కానున్నాయి. టీజీఎస్ఆర్టీసీ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆపరేటర్లు వీటిని నిర్వహిస్తారు. ఛార్జింగ్ కు ఎంత వసూలు చేయాలనేది ఆర్టీసీ నిర్ణయిస్తుంది.
హకీంపేట్ టీఏ, షామీర్ పేట్, గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపో, కుకునూర్ పల్లి, దుద్దెడ, తిమ్మాపూర్, కరీంనగర్ జోనల్ వర్క్ షాప్, కోరుట్ల, లక్సెట్టిపేట్, గోదావరి ఖని, పెద్దపల్లి, మేడ్చల్, తూప్రాన్, చేగుంట, జక్రాన్ పల్లి, బాల్కొండ, చౌటుప్పల్, చిట్యాల, కట్టంగూర్, సూర్యాపేట్ లల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి.
వీటితో పాటు- మందలపల్లి, కొత్తగూడెం, జడ్చర్ల, అడ్డాకుల, కొత్తకోట, యాచారం, మాల్, నాగార్జున సాగర్, అచ్చంపేట్, నారాయణ్ పేట్ డిపో, నాగర్ కర్నూల్ డిపోల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను నెలకొల్పడానికి ఆపరేటర్ల నుంచి బిడ్డింగులను ఆహ్వానించింది టీజీఎస్ఆర్టీసీ. ఆన్ లైన్ ద్వారా వీటిని దరఖాస్తు చేయడానికి చివరి తేదీ.. ఈ నెల 22. సాయంత్రం 5 గంటల్లోపు వీటిని దాఖలు చేయాల్సి ఉంటుంది.
హార్డ్ కాపీలను సమర్పించడానికి చివరి తేదీ ఈ నెల 23. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల్లోగా వాటిని అందజేయాలి. ఇతర వివరాల కోసం https://tender.telangana.gov in/, https://www.tgsrtc.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు లేదా.. 9100998224 నంబర్ కు ఫోన్ చేయవచ్చు.
-
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..!











Click it and Unblock the Notifications